విడాకుల పుకార్లపై ధనశ్రీ వర్మ స్పందన
అయితే తనపై రాస్తున్న ఊహాజనిత వార్తలు, కథనాలపై ధనశ్రీ వర్మ తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. తమ కుటుంబానికి కష్టకాలమిదని అన్నారు.
By: Tupaki Desk | 8 Jan 2025 4:48 PM GMTభారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. దీనిని ఈ జంట అధికారికంగా ధృవీకరించలేదు. ఇంతలోనే నెటిజనుల్లో రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ ఇద్దరిలో ఎవరిది తప్పు? అంటూ విచారణ మొదలుపెట్టారు. అయితే తనపై రాస్తున్న ఊహాజనిత వార్తలు, కథనాలపై ధనశ్రీ వర్మ తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. తమ కుటుంబానికి కష్టకాలమిదని అన్నారు.
ఇవన్నీ నిరాధారమైనవి.. అవాస్తవ కథనాలు అని ధనశ్రీ ఖండించారు. గత కొన్ని రోజులు తనకు, తన కుటుంబానికి చాలా సవాల్‌గా మారాయని ధనశ్రీ ఆవేదన చెందారు. ఊహాజనిత తప్పుడు కథనాలతో తన క్యారెక్టర్ ను హత్య చేసారని ధనశ్రీ వ్యాఖ్యానించారు. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.. సమర్థించుకోదని అన్నారు. ఇంకా ఈ ఇన్ స్టా పోస్టులో ఇలా రాసారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ద్వేషాన్ని వ్యాపింపజేసే ముఖం లేని ట్రోలర్లు నా ప్రతిష్టను హత్య చేయడంతో నేను నిజంగా కలతకు గురయ్యాను. వృత్తిగతంగా ఎదగడానికి, పేరు తెచ్చుకోవడానికి నేను సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు.. ఆన్‌లైన్‌లో సులభంగా ప్రతికూలతను ప్రచారం చేస్తున్నా.. మీరు ఇతరులను ఉద్ధరించడానికి ధైర్యం, కరుణ అవసరం. నిజాన్ని దృష్టిలో పెట్టుకుని, నా విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించాను. సత్యం అండగా నిలుస్తుంది.. సమర్థించుకోవాల్సిన అవసరం లేదు! అని రాసారు. ఓం నమః శివాయ అంటూ లేఖకు ముగింపు ఇచ్చారు.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ కం రియాలిటీ షో స్టార్ ధనశ్రీ విడాకుల గురించి వారం రోజులుగా చాలా ప్రచారం సాగింది. 2020 లో పెళ్లాడిన ఈ జంట నాలుగేళ్లకే విడిపోతున్నారని కథనాలొచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో యుజ్వేంద్ర -ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఈ పుకార్లకు కొనసాగింపుగా.. యుజ్వేంద్ర ధనశ్రీతో ఉన్న అన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించాడు. అయితే ధనశ్రీ ప్రొఫైల్‌లో చాహల్ ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఈ జంట డిసెంబర్ 2020లో గురుగ్రామ్‌లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆరంభంలో ధనశ్రీ యూట్యూబ్ డ్యాన్స్ క్లాస్‌లలో చాహల్ చేరాడు. అనంతరం ప్రేమ కథ ప్రారంభమైంది. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు విడాకుల పుకార్లు ఇబ్బందికరంగా మారాయి.