సన్యాసం లేదు...రాజకీయమేనట !
అదేంటి అంటే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని వార్తలు విస్తృతంగా వ్యాపించాయి.
By: Tupaki Desk | 29 Dec 2024 4:25 AM GMTఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మనా సోదరుల బలం ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు సోదరులు మొదట కాంగ్రెస్ లో ఉన్నారు. తరువాత వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. వారి వల్ల టీడీపీ కంచుకోటలో సైతం సైకిల్ కి అనేక సార్లు బ్రేకులు పడ్డాయి. టీడీపీని నడిపిస్తున్న కింజరాపు కుటుంబానికి సరిజోడుగా గట్టి ప్రత్యర్థులుగా ధర్మాన సోదరులు నిలిచి గెలిచారు.
ఇదిలా ఉంటే 2024లో భారీ ఓటమి తరువాత ధర్మాన సోదరులలో చిన్నవారు అయిన మాజీ మంత్రి ప్రసాదరావు రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని ప్రచారం సాగింది. లేటెస్ట్ గా చూస్తే మరో ప్రచారం మొదలైంది. అదేంటి అంటే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని వార్తలు విస్తృతంగా వ్యాపించాయి.
అయితే నిన్నటికి నిన్న జరిగిన వైసీపీ ధర్నాలో ధర్మాన క్రిష్ణదాస్ పార్టీ శ్రేణులను ముందుండి నడిపించారు. అంతే కాదు తమ సోదరులు ఇద్దరి మీద వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని క్యాడర్ ని ఆయన కోరారు అని అంటున్నారు. రాజకీయాల్లో తాము కొనసాగుతామని ఆయన గట్టిగా చెప్పినట్లుగా పేర్కొంటున్నారు.
రాజకీయాల్లో ఉన్న వారు ఒక సిద్ధాంతానికి ఒక పార్టీకి కట్టుబడి ఉండాలని అపుడే వారికి విలువ గౌరవం ఉంటాయని కూడా అంటున్నారు. ఈ విషయంలో ధర్మాన సోదరులు వేరే పార్టీలలోకి వెళ్ళే ప్రసక్తి ఉండదని అంటున్నారు. ప్రసాదరావు విషయనికి వస్తే ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిదేళ్ల పాటు శ్రీకాకుళానికి తాను ఎంతో అభివృద్ధి చేస్తే జనాలు భారీ మెజారిటీతో ఓడించారు అని ఆవేదన చెందుతున్నారు అంటున్నారు
నాలుగున్నర దశాబ్దలా రాజకీయ చరిత్రలో ప్రసాదరావు ఎన్నో రకాలైన అనుభవాలను చూసారని కానీ ఈనాటి పరాజయం మాత్రం ఇంత ఘోరంగా ఉండడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని అంటున్నారు. ఆయన అందుకే కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారని అంటున్నారు
ఆయన కానీ క్రిష్ణదాస్ కానీ వేరే పార్టీలలోకి వెళ్లరని కూడా క్యాడర్ చెబుతోంది. ధర్మాన సోదరుల మీద జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని ఖండిస్తోంది. కింజరాపు ఫ్యామిలీని కానీ టీడీపీ రాజకీయాన్ని కాది జిల్లాలో ఎదురొడ్డి నిలిచేది ధర్మాన కుటుంబమే అని కూడా అంటున్నారు.
రాజకీయాలు అన్నాక గెలుపు ఓటములు ఉంటాయని వాటికి జడిసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఎవరూ చేయరని అంటున్నారు. రాజకీయంగా విశేష అనుభవం కలిగిన ధర్మనా సోదరులు అయితే రాజకీయంగా కొనసాగుతారని చెబుతున్నారు. మరి తొందరలోనే ప్రసాదరావు కూడా యాక్టివ్ అవుతారని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.