ధర్మాన ధర్మంగా చెప్పారా...!?
ఇక ఆయన ఇపుడు ఒక విమర్శ చేశారు. నిజం చెప్పాలంటే ఆయన ఇటీవల కాలంలో ఇదే మాటను పదే పదే అంటున్నారు రోడ్లు వేస్తేనేనా అభివృద్ధి అన్నది ధర్మాన లా పాయింట్.
By: Tupaki Desk | 14 Dec 2023 2:30 AM GMTఆయన సీనియర్ వైసీపీ మంత్రి. వివాదాస్పద వ్యాఖ్యలు అపుడపుడు చేసినా ఆయన ఎపుడూ సబ్జెక్ట్ మీదనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గణాంకాలతో సహా అన్ని వివరాలు చెప్పడంలో ఆయనకు సరిసాటి ఎవరూ లేరు అనే అంటారు. ఇదిలా ఉంటే ఈ సీనియర్ మంత్రి విపక్షాల మీద విమర్శలు చేస్తారు. అయితే అవన్నీ జనరలైజ్ చేస్తూనే సాగుతాయి.
ప్రత్యేకించి ఎవరినీ టార్గెట్ చేసినట్లుగా మాట్లాడరు. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మంత్రి చేసే కామెంట్స్ కూడా ఒక్కోసారి హైలెట్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ధర్మాన అపుడపుడు చేసే వివాదాస్పద కామెంట్స్ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఉంటాయి.
ఇక ఆయన ఇపుడు ఒక విమర్శ చేశారు. నిజం చెప్పాలంటే ఆయన ఇటీవల కాలంలో ఇదే మాటను పదే పదే అంటున్నారు రోడ్లు వేస్తేనేనా అభివృద్ధి అన్నది ధర్మాన లా పాయింట్. లాజిక్ పాయింట్ కూడా. ప్రజలకు కావాల్సినవి అన్నీ ఇస్తున్నామని అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయి సామాజిక న్యాయం అందరికీ చేస్తున్నామని ధర్మాన చెబుతున్నారు.
అలాంటపుడు రోడ్లు వేరేగా వేయాలా అన్నది ధర్మాన వారి ధర్మాన మాట. అయినా కూడా అక్కడక్కడ రోడ్లకు గుంతలు పడితే దాన్ని చూపించి యాగీ చేయడం ఏంటి అని ధర్మాన ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు రాష్ట్రంలో కొత్తగా రోడ్లు వేస్తే అభివృద్ధి జరిగినట్లా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు.
చిన్న విషయాలను కూడా పెద్దగా చూపించి విపక్షాలు రాజకీయ రచ్చ చేస్తున్నాయని అంటున్నారు. అయితే విపక్షాల సంగతేమో కానీ ఈ సీనియర్ మంత్రి పదే పదే రోడ్లు వేయకపోతే అభివృద్దా అంటూ తాము రోడ్లు వేయలేదన్న సంగతిని కోరి మరీ చెప్పేసుకుంటున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అభివృద్ధి విషయంలో విపక్షాలు విమర్శలు చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి కూడా వేరే అవకాశాలు ఉండగా తాము ఆ రోడ్లు వేయడం లేదని మంత్రి ఎందుకు చెప్పేసుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ధర్మాన ధర్మంగా చెప్పినా అందులో వివాదాలు వెతికే చాన్స్ ని విపక్షాలకు ఇచ్చేశారు అని అంటున్నారు.