Begin typing your search above and press return to search.

కొత్త సమస్య... అల్లు అర్జున్ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించారా..?

దీంతో.. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తోపాటు బయలుదేరి చిక్కడపల్లి స్టేషన్ కు చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 6:51 AM GMT
కొత్త సమస్య...  అల్లు అర్జున్  బెయిల్  కండిషన్స్  ఉల్లంఘించారా..?
X

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ రోజు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో.. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తోపాటు బయలుదేరి చిక్కడపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది.

అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యారు. అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తుండగా.. ఈ సమయంలో అల్లు అర్జున్ తో పాటు ఉండటానికి అతని తరుపు న్యాయవాది పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు!

ఆ సంగతి అలా ఉంటే... అల్లు అర్జున్ కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... ఆ మధ్యంతర బెయిల్ కండిషన్స్ ను అల్లు అర్జున్ ఉల్లంఘించారా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. దీంతో.. ఈ బెయిల్ క్యాన్సిల్ పై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

వాస్తవానికి అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.. మూడో కండిషన్ గా... దర్యాప్తుతో ఎక్కడా కూడా పిటిషనర్ జోక్యం ఉండకూడదని పేర్కొందని అంటున్నారు. అయితే.. బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ ఇటీవల మీడియా ముందుకు వచ్చారు.. పలు వ్యాఖ్యలు చేశారు.. కేసుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారని చెబుతున్నారు!

ఇందులో భాగంగా.. థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడూ తనను ఏ పోలీసూ కలవలేదని.. కొంచెంసేపటి తర్వాత తన వాళ్లు వచ్చి.. బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, దయచేసి వెళ్లిపోండి అని చెప్పారు.. దీంతో.. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి తాను, తన భార్య అంతా వెళ్లిపోయాం అని అల్లు అర్జున్ చెప్పిన అంశాన్ని ప్రస్థావిస్తున్నారని అంటున్నారు.

దీంతో... ఈ అంశం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ లోని నిబంధనలను ఉల్లంఘించినట్లే అని పోలీసులు అంటున్నారని తెలుస్తోంది. దీంతో... నెక్స్ట్ పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.