Begin typing your search above and press return to search.

టీడీపీకి కేంద్ర మంత్రులు హెల్ప్ అవుతున్నారా ?

ఉత్తరాంధ్రాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:00 AM GMT
టీడీపీకి  కేంద్ర మంత్రులు హెల్ప్ అవుతున్నారా ?
X

ఏపీలో టీడీపీ కూటమి ఉంది. ఆ ప్రభుత్వంలో బీజేపీకి చెందిన ఒక మంత్రి ఉన్నారు. అలాగే కేంద్రంలో ఇద్దరు టీడీపీకి చెందిన మంత్రులు ఉన్నారు. ఇందులో ఒకరిది కేబినెట్ ర్యాంక్. మరొకరిది స్టేట్ ర్యాంక్.

ఉత్తరాంధ్రాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి. అయితే రామ్మోహన్ ద్వారా ఏపీలో టీడీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించుకోగలుగుతోందా. కేంద్ర ప్రభుత్వంతో కావాల్సిన పనులు చేయించగలుతోందా అన్నదే చర్చ.

చంద్రబాబు తాను స్వయంగా ప్రతీ నెలా పనిగట్టుకుని ఢిల్లీ వెళ్తున్నారు వెళ్ళినపుడల్లా రెండు రోజులు ఉండి వస్తున్నారు. ఆయన వరసబెట్టి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు వారికి విన్నపాలు చేస్తున్నారు. అంతా చేస్తామని హామీలు దక్కుతున్నాయి కానీ మళ్లీ ఆ విషయం అలాగే ఉంటోంది.

కీలకమైన మద్దతుదారుగా టీడీపీ ఉన్నా కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండడంతో కొంత అసంతృప్తి అయితే ఆ పార్టీలో ఉంది. ఇక కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. టీడీపీ పెద్దలు చెప్పేవి అన్నీ వింటున్నారు అలాగే అని ముఖం ముందు మంచి మాటలే చెబుతున్నారు. ఆచరణలో మాత్రం ఆలస్యం జాప్యం జరుగుతోంది అని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. అమరావతి పోలవరం అన్నవి కంప్లీట్ కావాల్సిందే. దండీగా నిధులు అవసరం ఇలా అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం కేంద్రం వైపు చూస్తోంది. కానీ ఈ నాలుగు నెలలలో ఆశించిన విధంగా సాయం అయితే దక్కడం లేదు అని అంటున్నారు.

మరో వైపు మోడీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఇంకా తన చొరవ చూపాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆయన తన తండ్రి ఎర్రనాయుడు మాదిరిగా పూర్తి స్థాయిలో పలుకుబడిని ఇంకా సాధించలేదు అని అంటున్నారు. జాతీయ మీడియాతోనూ ఇంకా ఇంటరాక్షన్ పెంచుకోవాల్సి ఉదని అంటున్నారు.

ఢిల్లీ లాబీయింగ్ లో ఆరితేరాల్సి ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి ఎన్నో మార్లు కేంద్రంలో మంత్రులు ఉన్నారు. బీజేపీ గెలిచినపుడు అంతకు ముందు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దాని కంటే ముందు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా టీడీపీ కేంద్ర మంత్రి పదవి చేపట్టింది. కానీ వారి వల్ల పెద్దగా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ లాభం దక్కినది లేదనే అంటున్నారు.

గతంలో ఇదే పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉండేవారు. ఆయన తన శాఖ పనితీరుని చూసుకుంటూ ఉండేవారు. ఆ అయిదేళ్ల టెర్మ్ లో ఏపీకి కేంద్రం ఇచ్చినది దక్కినదీ తక్కువే అని చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు ఢిల్లీ వెళ్తేనే పలకరించి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు కానీ అదే టీడీపీ కేంద్ర మంత్రులుగా ఉన్న వారు ఎవరు అయినా తమ టీం అని మాత్రమే అనుకుంటున్నారు కేంద్ర పెద్దలు అన్న మాట ఉంది. ఏది ఏమైనా కేంద్ర బీజేపీ వ్యూహాలు వేరుగా ఉంటాయి. దాంతో వారు ఏమి అనుకుంటున్నారో ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదే ఇస్తారు, అదే చేస్తారు అని అంటున్నారు.