సజీవంగా హమాస్ అధినేత... మీడియా ఏమి చెబుతోంది?
అయితే... ఆ దాడుల రూపకర్త, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయేల్ దాడుల్లో మరణించలేదని.. అతడు ఇంకా సజీవంగానే ఉన్నాడని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
By: Tupaki Desk | 8 Oct 2024 7:48 AM GMTఅక్టోబర్ 7వ తేదీ ఇజ్రాయెల్ చరిత్రలో ఒక బ్లాక్ డే అనే చెప్పాలి. ఆ రోజు ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడుల ఫలితంగా ఏర్పడిన రక్తపాతం అంత ఇంతా కాదు. అయితే... ఆ దాడుల రూపకర్త, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయేల్ దాడుల్లో మరణించలేదని.. అతడు ఇంకా సజీవంగానే ఉన్నాడని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
అవును... ఇజ్రాయెల్ చరిత్రలో బ్లాక్ డే గా మారిన అక్టోబర్ 7నాటి దాడుల రూపకర్త, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతిచెందినట్లు అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే... అతడు సజీవంగా ఉన్నాడని, ఖతర్ తో రహస్య సంబంధాలు ఏర్పరచుకుంటున్నారని చెబుతూ ఇజ్రాయెల్ కు చెందిన పలు మీడియా కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ మేరకు ఓ సీనియర్ ఖతర దౌత్యవేత్త.. హమాస్ అధినేత సజీవంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణ కవచంగా ఉంచుకున్నట్లు గతంలో ఖతర్ అధికారులు పేర్కొన్నట్లు ఆ పోస్ట్ లో ఉంది.
వాస్తవానికి సెప్టెంబర్ 21న గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వార్ చనిపోయాడని భావించారు. అయితే దీనిపై హమాస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ఈ విషయానికి బలం చేకూరింది. మరో పక్క ఆ దాడుల్లో 22 మంది మరణించినట్లు పాలిస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కాగా... 1962లో జన్మించిన సిన్వార్... 1987లో ఏర్పాటైన హమాస్ లో ప్రారంభ సభ్యుడిగా ఉన్నారు. ఇతడికి "ది బుట్చర్ ఆఫ్ ఖాన్ యూనిస్" అనే మారుపేరు లాంటి బిరుదు ఉందని చెబుతారు.