Begin typing your search above and press return to search.

మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? తాజా రిపోర్టులో షాకిచ్చే అంశాలు

ఇటీవల కాలంలో పెరిగిన కరవు కాటకాలు.. విపత్తులపై ఐపీఈ గ్లోబల్.. ఈఎస్ఆర్ ఐ ఇండియా తాజా అధ్యయనాన్ని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 4:31 AM GMT
మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? తాజా రిపోర్టులో షాకిచ్చే అంశాలు
X

మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? మనం చేసే తప్పులకు ప్రకృతి శిక్షలు వేస్తుందా? ఇటీవల కాలంలో రోజుల తరబడి ముసురేయటం.. వాగుల్ని.. వంకల్ని ఏకం చేసేలా భారీ వర్షాలు.. గంటల వ్యవధిలో కురిసే కుంభవ్రష్టి. దీంతో.. మునిగిపోయే పట్టణాలు.. నగరాలు. ఇవన్నీ చాలావన్నట్లు మండే ఎండలు.. గజ గజ వణికేలా చలి. ఏది చూసినా.. అసాధారణంగా వ్యవహరిస్తున్న తీరుపై జరిపిన అధ్యయనం షాకింగ్ అంశాల్ని వెల్లడించింది.

ఇటీవల కాలంలో పెరిగిన కరవు కాటకాలు.. విపత్తులపై ఐపీఈ గ్లోబల్.. ఈఎస్ఆర్ ఐ ఇండియా తాజా అధ్యయనాన్ని వెల్లడించింది. - 1973 - 2023 మధ్య ఐదు దశాబ్దాల్లో నమోదైన అసాధారణ ప్రకృతి విపత్తులను విశ్లేషించారు. దీన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్న క్లైమేట్ టెక్నాలజీ సదస్సులో ఆవిష్కరించారు. ఏపీ.. తమిళనాడు..కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నానాటికీ పెరుగుతున్నట్లుగా పేర్కొంది. దేశంలోని 85 శాతం జిల్లాల్లో అసాధారణ విపత్తులు నెలకొన్నాయని.. ఐదు దశాబ్దాల్లో వీటి తీవ్రత నాలుగు రెట్లు పెరిగినట్లుగా పేర్కొన్నారు.

45 జిల్లాల్లో కరువు నేలల్లో వరదలతో అతలాకుతలం అవుతున్నట్లుగా పేర్కొన్నారు. పర్యావరణంలో వస్తున్న అసాధారణ మార్పులతో విపత్తులు సైతం అసాధారణ స్థాయిలో విరుచుకుపడి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని వెల్లడించారు. బిహార్.. ఏపీ.. ఒడిశా.. గుజరాత్.. రాజస్థాన్.. ఉత్తరాఖండ్.. హిమాచల్ ప్రదేశ్.. మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. అసోం రాష్ట్రాల్లోని 60 శాతానికి పైగా జిల్లాలు కనీసం ఏడాదికి ఒక్క అసాధారణ ప్రకృతి ఉత్పాతాన్ని చవిచూస్తున్నట్లుగా పేర్కొన్నారు. విపత్తులు మామూలుగానే భయంకరంగా ఉంటాయి.

వాతారణ మార్పుల కారణంగా.. విపత్తులు అసాధారణంగా విరుచుకుపడుతూ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వెల్లడైంది. గడిచిన యాభై ఏళ్లలో ఇలాంటి అసాధారణ విపత్తుల ఫ్రీక్వెన్సీ.. ఇంటెన్సిటీ.. అన్ ప్రెడిక్టబిలిటీలు నాలుగు రెట్లు పెరిగాయి. గడిచిన పదేళ్లలో ఈ తీరు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. 45 జిల్లాల్లో కరువు నేలలను వరదలు ముంచేస్తున్నట్లుగా గుర్తించిన అధ్యయనం.. వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ రిపోర్టులో పేర్కొన్న మిగిలిన ముఖ్యాంశాల్ని చూస్తే..

- ఈ పరిస్థితులకు మనుషులే కారణం

- ప్రకృతిలోని మిగిలిన జీవుల్ని పట్టించుకోకుండా మనుషఉలు చేపట్టే కార్యకలాపాలే ఈ అసాధారణ విపత్తులకు కారణం.

- పెరిగిన కర్బన ఉద్గారాలు.. పద్దతి లేని ల్యాండ్ స్కేప్ ప్లానింగ్.. ప్రకృతిలోని మిగిలిన జీవుల్ని పట్టించుకోకపోవటం

- దేశంలోని తూర్పు ప్రాంత జిల్లాలు అసాధారణ వరదల బారిన పడే ముప్పు ఎక్కువ

- వరదప్రాంతాల నుంచి కరువు ప్రాంతాలుగా మారిన జిల్లాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి..

1. మహబూబ్ నగర్

2. నల్గొండ

3. శ్రీకాకుళం

4. గుంటూరు

5. కర్నూలు

మరి మన ముందున్న మార్గం ఏంటి?

అన్నింటికంటే ముందు క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయటం ద్వారా భవిష్యత్తు ముప్పులను ముందే అంచనా వేసి.. ఆ మేరకు జాతీయ.. రాష్ట్ర.. జి్లా.. నగర స్థాయిల్లోనిర్ణయాలు తీసుకునే వ్యవస్థ. ఒక ఫండ్ ఏర్పాటు చేసి.. పర్యావరణ మార్పులకు ఎక్కువగా ప్రభావితం కాని కీలక మౌలిక వసతులను కల్పించాలి. నిజానికి అంతర్జాతీయ సగటుతో పోలిస్తే మన దేశంలో తలసరి కర్బన్ ఉద్గారాల విడుదల మూడో వంతు మాత్రమే. అమెరికా.. చైనాతో పోలిస్తే పిసరంత మాత్రమే. అయినా.. పర్యావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువ ప్రభావితం అవుతున్నది మన దేశమే.

పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు మనం కర్బన్ ఉద్గారాలను తగ్గించుకునే ప్రయత్నాల్ని చేస్తున్నామని.. దానికి బదులుగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేలా నడుచుకునే విధానాన్ని రూపొందించాల్సి ఉంది. మొక్కలు నాటటం.. చెట్లు నరకకుండా ఉండటం.. ఏసీల వాడకంఅవసరం లేకుండా సహజంగా ఇళ్లు.. ఆఫీసులను చల్లగా ఉంచేలా నిర్మాణాల్ని చేపట్టటం లాంటివి చేయాలి. ఈ అధ్యయనంలోని అంచనా ప్రకారం 2036 నాటికి 147 కోట్ల మంది భారతీయులు అసాధారణ ప్రకృతి విపత్తుల బారిన పడనున్నట్లుగా హెచ్చరించటం గమనార్హం.