Begin typing your search above and press return to search.

భార్యను రేమండ్స్ ఛైర్మన్ కొడుతుంటే అంబానీలు సేవ్ చేశారా?

ఈ ఎపిసోడ్ లో దేశ అపర కుబేరుడు ముకేశ్ అంబానీల విషయం బయటకు రావటం.. వారు కలుగజేసుకోవటంతో రేమండ్స్ ఛైర్మన్ దాదాగిరి ఆగిందన్న వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:18 AM GMT
భార్యను రేమండ్స్ ఛైర్మన్ కొడుతుంటే అంబానీలు సేవ్ చేశారా?
X

పెద్దోళ్ల ఇంటి విషయాలు గుట్టుగా ఉంటాయి. మహా అయితే.. పుకార్ల రూపంలో బయటకు వస్తాయి. అది కూడా కొన్ని వర్గాల వారికే పరిమితమవుతుంటాయి. అందుకు భిన్నంగా తాజాగా దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన రేమండ్స్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఇంటి విషయాలు ఇప్పుడు పబ్లిక్ అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో దేశ అపర కుబేరుడు ముకేశ్ అంబానీల విషయం బయటకు రావటం.. వారు కలుగజేసుకోవటంతో రేమండ్స్ ఛైర్మన్ దాదాగిరి ఆగిందన్న వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తన భర్త గౌతమ్ సింఘానియా తనను.. తన పిల్లల్ని కొడుతున్న వేళ.. తమను అంబానీ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చి కాపాడినట్లుగా రేమండ్స్ ఛైర్మన్ కం ఎండీ సతీమణి నవాజ్ మోదీ వెల్లడించారు. ఇటీవల ఆమె తన భర్త నుంచి విడిపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సంచలన అంశాల్ని వెల్లడించారు. గౌతమ్ తనను శారీరకంగా హింసకు గురి చేశాడని.. ఆ టైంలో తనను.. తన పిల్లల్ని అంబానీలు వచ్చి కాపాడారంటూ ఆమె తెలిపిన వివరాలు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి. పెద్దోళ్ల ఇళ్లల్లోని విషయాలు ఇంతలా ఉంటాయా? అన్నట్లుగా ఉన్నాయి.

తమపై జరిగిన దాడిని.. దీపావళి పార్టీకి తమను అనుమతించకపోవటంపై నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె చెప్పిన వివరాల్ని చూస్తే..

- సెప్టెంబరు 10న ఉదయం మా మైనర్ కుమార్తెపైనా.. నాపైనా గౌతమ్ తీవ్రంగా దాడి చేశారు. పదిహేను నిమిషాల పాటు కనికరం లేకుండా కొట్టారు. ఇదంతా కూడా ఆయన పుట్టిన రోజు (సెప్టెంబరు 9) వేడుక తర్వాతి రోజు జరిగింది.

- తెల్లవారుజాము సమయంలో మా ఇద్దరి కుమార్తెలు.. వారి స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. మాపై దాడి చేసి.. అక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. గన్ లేదంటే ఏదైనా ఆయుధం తేవటానికి వెళ్లి ఉంటారనిపించింది.

- వెంటనే నా కుమార్తెల ప్రాణాల్ని కాపాడేందుకు ఒక గదిలోకి వెళ్లి లాక్ చేశా. నాకు రెండుసార్లు హెర్నియా సర్జరీ జరిగిన విషయం తెలిసినప్పటికీ నాపై దాడి చేశారు. నేను..నా కుమార్తె ఒకరినొకరు కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేశాం.

- నా స్నేహితురాలు అనన్య గోయెంకాకు ఫోన్ చేశా. అప్పటికే ఇంటికి పోలీసులు రాకుండా గౌతమ్ మేనేజ్ చేశాడని అర్థమైంది. దాంతో అనన్య పోలీసుస్టేషన్ కు వెళతానని చెప్పింది. ఇంకోవైపు నా కుమార్తె తన స్నేహితుడు సింఘానియా సమీప బంధువు విశ్వరూప్ కు ఫోన్ చేసి పెద్దవాళ్లను తీసుకురావాలని కోరింది.

- విశ్వరూప్ మా ఇద్దరు అమ్మాయిలకు మంచి స్నేహితుడు. అతడికి మా ఇంటి పరిస్థితులు తెలుసు. ఆ టైంలోనే నీతా అంబానీ.. అనంత్ అంబానీ నాతో ఫోన్ లో మాట్లాడారు. వారి కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది.

- పోలీసులు ఎలాంటి సాయం చేయరని గౌతమ్ తన కుమార్తెతో అన్న విషయంతో ఆమె ఆందోళనతో ఉంది. పోలీసులు రాకుండా గౌతమ్ ఆపినప్పటికీ.. అంబానీలు రంగంలోకి దిగి పోలీసులు మా వద్దకు వచ్చేలా చేశారు.

ఇలా పలు సంచలన విషయాల్ని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన వివరాలు షాకింగ్ గా మారాయి. ఈ ఆరోపణలపై గౌతమ్ ను స్పందించాలని కోరగా.. తన ఇద్దరు కుమార్తెల ఫ్యూచర్ ను.. తన కుటుంబ పరువు మర్యాదల్ని పరిగణలోకి తీసుకొని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పటం గమనార్హం. రూ.11వేల కోట్ల నికర సంపద ఉన్న సింఘానియాకు.. ఫిట్ నెస్ ట్రైనర్ నవాజ్ కు అనుబంధం ఏర్పడటం వారిద్దరు 1999లో పెళ్లి చేసుకోవటం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల సెటిల్ మెంట్ లో భాగంగా గౌతమ్ ఆస్తిలో 75 శాతాన్ని భరణంగా కోరుతున్నారు. అంటే.. దాదాపు రూ.8వేల కోట్లు పైనే భరణాన్ని కోరుకున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.