Begin typing your search above and press return to search.

టాక్ ఆఫ్ ది టౌన్... బాలయ్య - హీరోయిన్ - మందు బాటిల్!?

ఈ సమయంలో మాంచి స్పైసీ న్యూస్ ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   29 May 2024 12:41 PM GMT
టాక్  ఆఫ్  ది టౌన్... బాలయ్య - హీరోయిన్ - మందు బాటిల్!?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితాలు జూన్ 4 కావడంతో రాజకీయ వాతావరణం కాస్త చప్పగా సాగుతుంది. పోలింగ్ పూర్తయిన మొదటి రెండు మూడు రోజులూ ఫలితాలకు సంబంధించిన చర్చలు, విశ్లేషణలు, అంచనాలు హాట్ హాట్ గా సాగినప్పటికీ.. రాను రానూ వాటిపైనా ఇంట్రస్ట్ తగ్గిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో మాంచి స్పైసీ న్యూస్ ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఎంత వాస్తవం, ఎంత అవాస్తవం, వీడియోల్లో కనిపించింది, ప్రచారం జరుగుతున్నదే వాస్తవమా.. అనే సంగతి కాసేపు పక్కనపెడితే... జరుగుతున్న ప్రచారం కాస్తా నందమూరి బాలకృష్ణకు సంబంధించింది కావడంతో మేటర్ మాత్రం వైరల్ గా మారుతుంది.

అవును... తాజాగా జరిగిన విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ఫంక్షన్ కి బాలయ్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య తనకున్న చనువుతోనో, తెలుగమ్మాయి అనే అభిమానంతోనో హీరోయిన్ అంజలిని కాస్త పక్కకు జరగమని చెబుతూ చనువుగా గెంటినట్లు కనిపించారు! దీంతో అంజలి నవ్వుతూ పక్కకు జరిగారు. బాలయ్యకు తనకూ ఉన్న చనువును స్మైల్ తో తెలిపినట్లున్నారు!

ఆ సంగతి ఒకెత్తు అయితే... బాలయ్య ఓ బాటిల్ లో మందు పోసుకుని పక్కనే పెట్టుకున్నారని.. దాన్ని వాటర్ బాటిల్ తో కలిపి కాళ్ల దగ్గర పబ్లిక్ గా ఉంచుకున్నారంటూ ఒక విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. వాస్తవానికి ఆ బాటిలో ఉన్న లిక్విడ్ మద్యం రంగులో ఉండటంతో... అది మద్యమే అని ఒకరంటే.. ఆపిల్ జ్యూస్ కూడా అయ్యి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

దీంతో ఈ విషయం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహరానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ లో స్పందించింది. "మహిళల పట్ల టీడీపీ నేత బాలకృష్ణ మరోసారి అసభ్య ప్రవర్తన! ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వైనం! మహిళలంటే మీకు అంత చులకనా టీడీపీ?" అని రాసుకొచ్చింది.

ఇదే సమయంలో... బాలయ్యకు మహిళలంటే గౌరవం లేదని.. సినిమా ఫంక్షన్స్ లో వేదికలపై మహిళల పట్ల ఆయన వైఖరి ఇలాగే ఉంటుందని, అందులు పలు ఉదాహరణలు ఉన్నాయని చెబుతూ కామెంట్లు పెడుతుంది బాలయ్య వ్యతిరేక వర్గం! మరోపక్క అసలు ఈ వీడియో నిజమేనా లేక డీప్ ఫేకా అనే చర్చా తెరపైకి రావడంతో దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.

అసలే సినిమా వాళ్లకు సంబంధించిన వ్యవహారం, అందునా రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషిస్తున్న వ్యక్తి వ్యవహారం, ప్రధానంగా ఆయన నందమూరి బాలకృష్ణ కావడంతో.. ఈ వ్యవహారం, దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి! దీనిపై నెట్టింట చిన్నసైజు కామెంట్స్ వార్ నడుస్తుంది.

కాగా... విశ్వక్ సేన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ఈ నెల 31న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సరసన అంజలి, నేహాశెట్టి నటిస్తున్నారు. హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు.