మన పక్క రాష్ట్రంలో ఎగిరే ట్యాక్సీలు!
ఇందులో భాగంగా ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
By: Tupaki Desk | 29 July 2024 7:42 AM GMTప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన పట్టణాలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందనేది తెలిసిన విషయమే. ఇక రోజు రోజుకీ పెరుగుతున్న వాహనాల వల్ల ట్రాఫిక్ తో పాటు వాతావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రెండు సమస్యలకూ చెక్ పెడుతూ తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
అవును... అటు ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ, ఇటు వాతావరణ కాలుష్యానికీ చెక్ పెడుతూ తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణరహిత కార్గో ట్రాన్స్ పోర్టేషన్ కు తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చెన్నై, కోయంబత్తురు సిటీస్ లో ఈ ఫ్లయ్యింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తేనుంది. దీనికోసం విధివిధానాలు రూపొందిస్తుంది.
దీనికోసం ఇప్పటికే 22 మంది సభ్యులతో చెన్నై సిటీ కార్గో ట్రన్స్ పోర్ట్ కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రవాణా వ్యవస్థ పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కాగా.. రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థలో మార్పులు తేవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎగిరే ట్యాక్సీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. దీన్ని చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ పర్యవేక్షిస్తోంది.
చెన్నైతో పాటు ఏపీ సరిహద్దు జిల్లాలైన రాణీపేట, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో కలిసి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో... 2030 లోపు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పారిశ్రామిక విస్తృతి అవసరాలను తీర్చే పనిలో ఉంది.
ఈ సమయంలో... సరుకు రవాణా అందులో అందులో కీలక పాత్ర పోషించనుందని భావిస్తుంది. దీనికోసం రానున దశాబ్ధ కాలంలో కార్గో సేవలు ఎలా ఉండాలనే విషయంపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా... ముందుగా డ్రోన్ల ద్వారా సరుకు రవాణా చేయాలనే విషయంపై పలు పరిశీలనలు చేసింది. అయితే... ఈ ఆలోచనలో పలు సమస్యలు వచ్చాయని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ఈ డ్రోన్ల వల్ల సమయం వృథా అవ్వడంతోపాటు తక్కువ మోతాదులోనే కార్గో వెళ్లుందని భావించి, ఆ ఆలోచనకు అక్కడితోనే స్వస్థి పలికింది. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ప్రయాణించే కారు కంటే కాస్త పెద్ద సైజులో ఎగిరే ట్యాక్సీలపై శ్రద్ధ చూపుతోంది. ఇక ఈ విధానాన్ని ముందుగా చెన్నై, కోయంబత్తూరు సిటీల్లో చేపట్టేలా తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని అంటున్నారు.
ఇక.. 3×3, 5×5 సైజులతో రెండు రకాల ట్యాక్సీలను ఐఐటీ మద్రాస్ లోని ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తున్న "ఈ-ప్లేన్" సంస్థ విడుదల చేయనుంది. 50 కి.మీ. నుంచి 200 కి.మీ. దూరాన ఉన్న గమ్యస్థానాలకు పైలట్ వీటిని తీసుకెళ్లగరలరని చెబుతున్నారు. కారు కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇవి ప్రయాణించగలవని అంటున్నారు. ఇదే సమయంలో... 400 - 5000 మీటర్ల ఎత్తువరకూ వెళ్లగలవని చెబుతున్నారు.