సునీల్ కనుగోలుకు జగన్ ఆఫర్ ఇచ్చారా ?
దాంతో కర్ణాటక తెలంగాణాలలో కాంగ్రెస్ ని గెలిపించిన సునీల్ కనుగోలు వైపు వైసీపీ చూపు పడింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 22 Aug 2024 12:30 PM GMTసునీల్ కనుగోలు. ప్రశాంత్ కిశోర్ తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వారు. కర్ణాటకతో పాటు తెలంగాణాలోనూ కాంగ్రెస్ ని గెలిపించిన టాలెంట్ ఆయన సొంతం. ఆ విధంగా సునీల్ కనుగోలు పేరు తెలుగు నాట పెద్ద ఎత్తున మారుమోగింది. ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలిస్తూండడంతో రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
మరో వైపు చూస్తే ఈ రోజులలో రాజకీయం మొత్తం మారిపోయింది. ఎన్నికల వ్యూహకర్తలకు ఆయన కన్సల్టెన్సీ సంస్థల మీదనే ఆధారపడుతున్నారు రాజకీయ పార్టీల అధినేతలు. ఇలా రాజకీయ నేతల ఆరాటాలను ఆశలను సొమ్ము చేసుకుని ప్రశాంత్ కిశోర్ ఒక వెలుగు వెలిగారు.
ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐప్యాక్ టీం ని ఇపుడు రుషి టీం నడిపిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ తోడుగా ఉంటే ఐప్యాక్ టీం సక్సెస్ కొట్టింది. ఆయన లేకుండా రుషి టీం సొంతంగా నడిపించడం వల్లనే 2024 ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓటమి పాలు అయ్యారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కేవలం 11 సీట్లు వైసీపీకి వచ్చాయీ అంటే ఐప్యాక్ టీం నిర్వాకం వల్లనే జగన్ దెబ్బ తిన్నారు అని అంటున్నారు.
ఐప్యాక్ టీం వల్ల 2019లో 151 సీట్లు సాధించామని జగన్ నమ్మి అదే టీం చెప్పిన సూచనలు అన్నీ పాటించారు. అలా క్యాడర్ ని దూరం చేసుకున్నారు. దాంతో ఘోర ఓటమి దక్కింది. ఇపుడు పార్టీకి పట్టుకొమ్మల్లాంటి క్యాడర్ దూరం అయ్యారు. అలాంటి క్యాడర్ ని మళ్లీ యాక్టివ్ చేయడం అంటే చాలా పెద్ద పని అని అంటున్నారు.
2019 ఎన్నికల ముందు నియోజకవర్గాల బాధ్యతలను యువతకు ఇచ్చి ఇంచార్జీలుగా నియమిస్తే వారు ఎంతో కష్టపడి క్యాడర్ ని డెవలప్ చేశారు. అలా బలమైన క్యాడర్ ప్రతీ నియోజకవర్గంలో తయారు అయింది. అయితే ఎన్నికల్లో సీట్లు వారికి ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడంతో వేరే వాళ్ళకు ఇచ్చినా జగన్ వేవ్ లో గెలిచారు. అలా గెలిచిన వారు ఎవరూ క్యాడర్ ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అలా వైసీపీ క్యాడర్ పూర్తిగా నిస్తేజం అయింది.
మరో వైపు చూస్తే చంద్రబాబు కూడా తన పార్టీ క్యాడర్ ని 2024 ఎన్నికల ముందు యాక్టివ్ చేసుకోవడానికి రాబిన్ శర్మ ఇచ్చిన సలహా సూచనలు పాటించారు. టీడీపీ అయితే ఐటీడీపీ అని ఒక దాన్ని నడిపారు. దానికి సాలరీలు కూడా ఇచ్చి జగన్ ని బాగా టార్గెట్ చేసి జనంలో వైసీపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసారు. మొత్తానికి అలా అధికారాన్ని సాధించారు.
ఈ నేపధ్యంలో వైసీపీకి కూడా క్యాడర్ తో పాటు అన్ని విధాలుగా యాక్టివ్ కావాల్సి ఉంది. దాంతో కర్ణాటక తెలంగాణాలలో కాంగ్రెస్ ని గెలిపించిన సునీల్ కనుగోలు వైపు వైసీపీ చూపు పడింది అని అంటున్నారు. తెలంగాణాలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ని గెలిపించి అధికారంలోకి తెచ్చిన ఘనత సునీల్ కనుగోలుకే దక్కుతుంది అని అంటున్నారు.
ఐప్యాక్ తో వైసీపీకి కటీఫ్ అయింది. ఒక విధంగా రుషి టీం కనుమరుగు అయింది కాబట్టి వైసీపీ సునీల్ కనుగోలు సేవలను వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. సునీల్ కనుగోలు ఇపుడు సక్సెస్ ట్రాక్ మీద ఉన్నారని కూడా ఆయన మీద హోప్స్ పెట్టుకుంటున్నారు.
ఈ ఆలోచన రావడమేంటి బెంగళూరులో జగన్ సునీల్ కనుగోలుని పిలిపించుకుని మాట్లాడారు అని ఆయనతో పూర్తిగా అన్నీ చర్చించారు అని ప్రచారం అయితే సాగుతోంది. నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ ని మళ్లీ యాక్టివ్ చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఈ విషయంలో సునీల్ కనుగోలు పూర్తిగా ఆరితేరిన వారు కావడంతో ఆయనతో ఒప్పందానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
ఇక ఏపీలో రాజకీయం ఎలా ఉంది. వైసీపీ పరిస్థితి ఉంది ఇవన్నీ విశ్లేషించుకుని కానీ ఏమీ చెప్పలేనని సునీల్ కనుగోలు అన్నారని చెబుతున్నారు. అయితే జగన్ సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. దాంతో రానున్న రోజులలో వైసీపీకి సునీల్ కనుగోలు పనిచేస్తారు అని కూడా అంటున్నారు.
టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ కంటే కూడా సునులీ కనుగోలు వ్యూహాలలో పండిపోయారు అని అంటున్నారు. ఇక దక్షిణాది ప్రజలు వారి సెంటిమెంట్లు అన్నీ కూడా సునీల్ కనుగోలుకు బాగా తెలుసు అని అంటున్నారు. అంతే కాదు వాటిని ఎలా అమలు చేయాలో కూడా సునీల్ కనుగోలుకు తెలుసు అని అంటున్నారు. దాంతో ఆయనను వైసీపీకి కొత్త వ్యూహకర్తగా పెట్టుకోవడం వల్ల జగన్ పని ఈజీ అవుతుందని అంటున్నారు.
అదే విధంగా ఇప్పటికిపుడు లోకల్ గా సోషల్ మీడియాను ఎంగేజ్ చేసే పనిలో జగన్ ఉండాలని అంటున్నారు. కంటెంట్ క్రియేట్ చేస్తే సోషల్ మీడియాలో పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ స్ప్రెడ్ అవుతుంది. అలా ఏ న్యూస్ కంటెంట్ అయినా జనంలో వైరల్ అవుతున్నపుడే జగన్ కి మైలేజ్ వస్తుంది అన్న సూచనలు కూడా అందుతునాయట. సో ఈ విధంగా ఇప్పటి నుంచే వైసీపీని గేరప్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. జగన్ కి ఒకనాడు పీకే టీం గెలిపించింది. ఆయన శిష్యుడు రుషి టీం ఓడిందించింది. ఇపుడు సునీల్ కనుగోలు టీం తో సక్సెస్ ని మళ్ళీ అందుకుంటారా అంటే వెయిట్ అండ్ సీ.