Begin typing your search above and press return to search.

అనారోగ్యం.. వేదన..? జైల్లో 10 కిలోల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత?

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. జైలుకెళ్లిన తొలినాళ్లలో కొన్ని పుస్తకాలను కోరారు.

By:  Tupaki Desk   |   20 July 2024 9:54 AM GMT
అనారోగ్యం.. వేదన..? జైల్లో 10 కిలోల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత?
X

అంతా సరిగా ఉంటే.. ఇప్పుడు ఆమె కనీసం ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టేవారు.. లేదంటే హైదరాబాద్ ఆషాఢ బోనాల్లో పాల్గొని ఉండేవారు.. కానీ, కాలం మరోలా చేసింది. నాలుగు నెలలుగా జైలులో ఉన్నారు. మరి ఎప్పుడు బయటకు వచ్చేదీ తెలియడం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిస్థితి ఇది. సరిగ్గా మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ సమయంలో ఆమెను అరెస్టు చేశారు. ఈ తర్వాత తిహాడ్ జైలుకు తరలించారు. ఇప్పటికీ ఆమె అప్పటికే అక్కడే ఉన్నారు.

‘మోదీ’ పుస్తకాలు తెప్పించుకుని

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. జైలుకెళ్లిన తొలినాళ్లలో కొన్ని పుస్తకాలను కోరారు. ధ్యానం చేసుకోవడానికి జపమాలను అడగగా కోర్టు అనుమతిచ్చింది. స్పోర్ట్స్ షూ.. అది కూడా లేస్ లేని షూస్ ఇవ్వాలని కోరగా అనుమతిచ్చింది. ఆమె కోరిన పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ కు సంబంధించినవీ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కాగా.. ప్రధానులుగా పనిచేసిన వారి గురించి రాసిన పుస్తకాలనూ తెప్పించుకున్నారు. కాగా, కవిత జైలుకు వెళ్లకముందు తన చేతి వేళ్ల గోర్లను పొడవుగా పెంచారు. జైలు నిబంధనల రీత్యా వాటిని కూడా కత్తిరించినట్లు స్పష్టమైంది.

నాలుగు నెలల నుంచి..

ఆసియాలోనే రెండో అతి పెద్ద జైలు అయిన తిహాడ్ లో కవిత మూడు నెలలుగా ఉంటున్నారు. ఆమె అరెస్టు అయి నాలుగు నెలలు దాటిపోయింది. తరచూ బెయిల్ పిటిషన్లు వేస్తున్నా బెయిల్ రావడం లేదు. అనారోగ్య కారణాలు చూపినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పినా బెయిల్ రాలేదు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కింగ్ పిన్ గా ఆరోపణలు ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కవిత తర్వాత అరెస్టు చేశారు. అయితే, ఆయనకు లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బెయిల్ వచ్చింది. కవితకు మాత్రం ఊరట దక్కలేదు. కాగా, కవితకు సంబంధించిన తాజా విషయం ఏమంటే.. ఆమె జైలులో పది కిలోల బరువు తగ్గారట. ఇటీవల కవిత తీవ్ర జ్వరం బారినపడిన సంగతి తెలిసిందే. ఆమెను కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. కవిత భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం కవితను తిరిగి తిహాడ్ జైలుకు తీసుకెళ్లారు. కవిత అన్నయ్య, మాజీ మంత్రి కేటీఆర్, బావ హరీశ్ రావు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవల వారిద్దరూ ఢిల్లీలోనే వారం పాటు ఉండి వచ్చిన సంగతి తెలిసిందే.