Begin typing your search above and press return to search.

అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్ చూశారా... వీడియో వైరల్!

రెండు వాయిదాల అనంతరం జరిగిన ఈ ప్రయాణం సక్సెస్ అయ్యింది! ఈ సందర్భంగా సునీత చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 6:18 AM GMT
అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్  చూశారా... వీడియో వైరల్!
X

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) కు చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగమి బుల్ చిల్ మోర్ తో కలిసి ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక గురువారం ఐ.ఎస్.ఎస్. కు సక్సెస్ ఫుల్ గా అనుసంధానమైంది. రెండు వాయిదాల అనంతరం జరిగిన ఈ ప్రయాణం సక్సెస్ అయ్యింది! ఈ సందర్భంగా సునీత చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది.

అవును... సక్సెస్ ఫుల్ గా ఐ.ఎస్.ఎస్. కు అనుసంధానమైన అనంటరం సునీత విలియమ్స్, విల్ మోర్ లకు ఈ సందర్భంగా అక్కడ ఘనస్వాగతం లభించింది. ఇందులో భాగంగా చాలాకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం వారిని గంటకొట్టి లోనికి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఐ.ఎస్.ఎస్.కు చేరుకున్న సునీత... డ్యాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా స్పందించిన సునీత... ఐ.ఎస్.ఎస్.లో ఉన్నవారంతా తన ఫ్యామిలీ మెంబర్స్ అని.. వారిని కలిసిన ఆనందంలో తాను ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపారు.

కాగా... బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ కు ఇది తొలి మనావసహిత యాత్ర అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత సంగతికి చెందిన సునీతా విలియమ్స్ కు ఇది మూడో రోదరి యాత్ర కావడం గమనార్హం. గతంలో ఆమె రెండుసార్లు 20016, 2012ల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ క్రమంలో సుమారు 50 గంటల 40 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు స్పేస్ లో గడిపారు.

ఇక మునుపటి అంతరిక్ష యాత్రంలో ఆమె తనతో పాటు భగవద్గీతను వెంట తీసుకెళ్లగా.. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మారథాన్ రన్నర్ కూడా అయిన సునీత... ఐ.ఎస్.ఎస్.లోనూ ఓ సారి మారథాన్ కూడా చేశారు.