Begin typing your search above and press return to search.

రోజా కోసం తెగ సెర్చ్ చేస్తున్నారంట!?

రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడూ అయినా మైకుల ముందు కనిపించడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2024 3:30 PM GMT
రోజా కోసం తెగ సెర్చ్  చేస్తున్నారంట!?
X

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫుల్ హల్ చల్ చేసిన నేతలు, ప్రత్యర్థులపై యతి ప్రాసలతో విరుచుకుపడిన నాయకులు, మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కనిపించకుండా పోయారనే చర్చ ఏపీ రాజకీయాల్లోనూ, వైసీపీ శ్రేణుల్లోనూ బలంగా నడుస్తోందని తెలుస్తోంది. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడూ అయినా మైకుల ముందు కనిపించడం లేదని అంటున్నారు.

ప్రధానంగా నాడు మంత్రులుగా ఉన్న వారిలో పేర్ని నాని కాస్త రెగ్యులర్ గా కనిపిస్తుండగా.. అంబటి రాంబాబు, అమర్ నాథ్ కాస్త అప్పుడప్పుడూ తళుక్కు మంటున్నా.. మిగిలినవారు మరీ నల్లపూసలు అయిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే కనీసం కార్యకర్తల కంటి చూపులో పడకుండా తిరుగుతున్నారనే చర్చ నగరిలో మొదలైందని అంటున్నారు.

ఈ సమయంలో కార్యకర్తల సంగతి అలా ఉంచితే... నగరిలో రోజా మంత్రి అయిన తర్వాత పార్టీలోనే అంతర్గత శత్రువులు ఆమెకు బాగా ఎక్కువాయ్యారని.. అందుకు ఆమె వైఖరే కారణమనే విమర్శలు బాగా వినిపించాయి. అసలు రోజా ఆ స్థాయిలో ఘోర పరాజయం పాలవ్వడానికి గల కారణాల్లో ఆమె ఇంటర్నల్ ఎనిమీస్ పెర్ఫార్మెన్స్ ప్రధాన భూమిక పోషించిందని అంటున్నారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ హస్తిన వేదికగా ఏపీలోని కూటమి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా అంటూ.. ఢిల్లీలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అప్పట్లో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై మైకుల ముందు విరుచుకుపడిన రోజా.. సోషల్ మీడియాలో కనీసం ఓ సరైన పోస్ట్ కూడా పెట్టలేదు!!

అయితే దీనికి గల ప్రధాన కారణం వేరే ఉందని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం సుమారు నెల రోజుల పాటు నగరిలో ఇంటికే పరిమితమైన రోజా.. అప్పుడప్పుడు చెన్నైలోని ఆలయాలకు వెళ్తూ కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం నేటి వరకూ ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె నగరిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు కనిపించారు. అయితే ఆ ఈస్థాయిలో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించడానికి కారణం ఆమెకున్న శత్రువులే అని తెలుస్తోంది.

ఈ సమయంలో... ఆమె అధికారంలో ఉన్నప్పుడు తమను ఓ ఆటాడుకుందని.. ఇప్పుడు ఆమె గతంలో చేసిన వాటి గురించి ప్రశ్నిద్దామంటే కనిపించకుండా తిరుగుతున్నారంటూ ఆమె శత్రువులు తెగ వెతుకుతున్నారంట. ఇందులో భాగంగానే... "రోజా కనబడుట లేదు".. "రోజా ఆచూకీ తెలిపిన వారికి నగరిలో సన్మానం చేయబడును" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారని తెలుస్తోంది.