Begin typing your search above and press return to search.

దిల్ రాజు తల్లికి అస్వస్థత... ఐటీ అధికారుల కారులోనే ఆస్పత్రికి!

ఈ సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   23 Jan 2025 9:58 AM GMT
దిల్  రాజు తల్లికి అస్వస్థత... ఐటీ అధికారుల కారులోనే ఆస్పత్రికి!
X

గత మూడు రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా బడా నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సడన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సంబంధించిన వాహనంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వారితో పాటు మహిళా అధికారి ఒకరు వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలో మిగతా అధికారులు మాత్రం దిల్ రాజు నివాసంలో సోదాలు నిర్వహిస్తుండగా.. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దిల్ రాజుకు తల్లి ఆరోగ్యంపై ఆన్ లైన్ వేదికగా ఆరా తీస్తున్నారు. దీనిపై అధికారికంగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా... సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేశారు. మూడో రోజూ వీరి కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా... నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారని.. ఇదే సమయంలో పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా బ్యాంక్ లాకర్స్ ని కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీరిలో ప్రధానంగా దిల్ రాజుతో పాటు ఆయన కుమార్తె హన్సితా రెడ్డి ఇల్లు, ఆఫీసులలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.