Begin typing your search above and press return to search.

దిల్ రాజు కన్నీళ్ళకు ప్రకాష్ రాజ్ ఎమోషనల్

పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయనను పలువురు ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పరామర్శిస్తున్నారు. అలాగే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా దిల్‌ రాజును పరామర్శించారు

By:  Tupaki Desk   |   10 Oct 2023 11:12 AM GMT
దిల్ రాజు కన్నీళ్ళకు ప్రకాష్ రాజ్ ఎమోషనల్
X

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా తెలుగు చిత్రసీమ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 9 సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందతూ.. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు తెలిసింది.

తండ్రి మరణంతో దిల్ రాజు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయనను పలువురు ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పరామర్శిస్తున్నారు. అలాగే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా దిల్‌ రాజును పరామర్శించారు. కొందరు ఫోన్‌లో, మరికొందరు స్వయంగా వెళ్లి దిల్ రాజును ఓదార్చుతున్నారు.

ఇప్పటికే దిల్‌ రాజు ఇంటికెళ్లికి మెగాస్టార్ చిరంజీవి చేరుకుని.. శ్యాంసుందర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే దిల్ రాజు తండ్రి మరణవార్త తెలుసుకున్న సీనియర్​ నటుడు ప్రకాశ్ రాజ్‌ కూడా స్వయంగా దిల్​రాజును కలిసి పరామర్శించారు. శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన దిల్‌ రాజ్‌కు ధైర్య చెబుతూ కెమెరా కంటికి కనిపించారు. అప్పుడు తన బాధను ఆపుకోలేకపోయిన దిల్‌ రాజు.. ప్రకాశ్‌ రాజ్‌ను పట్టుకుని బోరున విలపించారు. ఈ దృశ్యాలు మనసును తాకుతున్నాయి.

కాగా, దిల్​ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. భార్య పేరు ప్రమీలమ్మ. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో దిల్​ రాజుతో పాటు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు. పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు దిల్​ రాజు. ఆయన మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హ‌న్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఇటీవలే జన్మించాడు. ప్రస్తుతం దిల్​ రాజు.. తన బ్యానర్​లో దిగ్గజ దర్శకుడు శంకర్​ - రామ్​చరణ్​తో కలిసి గేమ్​ ఛేంజర్​ అనే భారీ బడ్జెట్​ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.