Begin typing your search above and press return to search.

డర్టీ పార్టీ... బెంగళూరులో భార్యలను మార్చుకుని శృంగారం!

ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అయితే... మరింత దారుణం అని.. అత్యంత అధ్వానం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 12:30 PM GMT
డర్టీ పార్టీ... బెంగళూరులో భార్యలను మార్చుకుని శృంగారం!
X

ప్రపంచ దేశాలు అన్నీ భారత్ ను చూసి సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవాలన్నట్లుగా చాలా మంది వ్యాఖ్యానిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆ సంగతేమో కానీ.. భారతీయులు చాలా మంది మాత్రం పాశ్చాత్య సంస్కృతికి బానిసలైపోతున్నారని.. దుస్తులు, ఆహారపు అలవాట్ల నుంచి డర్టీ అలవాట్ల వరకూ అనుసరిస్తున్నారని అంటున్నారు.

ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అయితే... మరింత దారుణం అని.. అత్యంత అధ్వానం అని అంటున్నారు. వివాహ బంధం, ప్రేమానుబంధం ఇలాంటి వాటితో ప్రమేయం లేకుండా తప్పుడు ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒకరి భార్యను మరొకరు మార్చుకుని శృంగారం చేస్తున్న పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అవును... అత్యంత దారుణమైన అవలక్షణాల్లో డర్టీ పార్టీ కల్చర్ ఒకటని అంటుంటారు. ఈ తరహా పార్టీలు దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు పతనావస్తకు చేరిపోయాయనే మాటలకు అత్యంత బలం చేకూరుస్తాయని అంటారు. ప్రస్తుతం.. డబ్బున్న వారి లైఫ్ స్టైల్ లో ఈ డర్టీ పార్టీ ఓ భాగమవుతుందనే చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలో తాజాగా బెంగళూరు సిటీలో ఈ తరహా డర్టీ పార్టీ గుట్టు రట్టయ్యింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో భయంకరమైన విషయాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు. కర్ణాటకకు చెందిన హేమంత్, హరీష్ కలిసి బెంగళూరులో ఇలా లవర్స్ ని, భార్యలను ఎక్స్ ఛేంజ్ చేసుకుని, వారితో శృంగారం చేసే ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారట.

ప్రైవేట్ పార్టీల పేరుతో వీరిద్దరూ ఇలాంటి పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారని అంటున్నారు! ప్రధానంగా డబ్బున్న ప్రముఖులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బిజినెస్ మెన్ లు ఈ డర్టీ పార్టీలో భాగస్వాములు అవుతున్నారని అంటున్నారు. అయితే... ఓ వ్యక్తి తన భార్యను మరో వ్యక్తితో గడపాలని కోరడంతో షాకైన ఆమె వల్ల ఇది వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఓ వ్యక్తి తన భార్యను మరో వ్యక్తితో గడపాలని కోరడంతో.. ఆమె ఒక్కసారిగా షాకైందని అంటున్నారు. అయితే.. భర్త ఆమెతో గడిపిన శృంగార వీడియోలను, నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, మరో వ్యక్తితో బలవంతంగా శృంగారం చేసేలా ఒత్తిడి తెచ్చాడంట.

దీంతో.. అక్కడ నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. హరీష్, హేవంత్ లను అదుపులోకి తీసుకున్నరని అంటున్నారు. బెదిరించి, బలవంతం పెట్టి పలువురు మహిళలను వీరు ఈ రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారని అంటున్నారు.