వైసీపీ ఎమ్మెల్యేలలో అనర్హత భయం ?
దానికి వైసీపీ అధినేత జగన్ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. తాము అసెంబ్లీని బహిష్కరించలేదని విపక్ష హోదా మీద కోర్టుకు శాసనసభ స్పీకర్ సమాధానం చెప్పాలని కోరారు.
By: Tupaki Desk | 7 Feb 2025 3:30 PM GMTవైసీపీకి 2024 ఎన్నికల్లో ఏకంగా 11 మంది ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ నంబర్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోదు, 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష స్థానం దక్కుతుంది. దాంతో వైసీపీ అసెంబ్లీలో శాసన సభా పక్ష పార్టీగానే ఉంది. కానీ అసెంబ్లీలో ఉండేవి రెండే పార్టీలు ఒకటి అధికార కూటమి రెండు విపక్షంలో వైసీపీ కాబట్టి తమకు ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ అధినేత జగన్ కోరుతూ వస్తున్నారు.
సభా సంప్రదాయాల ప్రకారం చూస్తే అలా ఇవ్వలేమని కూటమి వైపు నుంచి చెబుతున్నారు. దీని మీద కోర్టులో వైసీపీ న్యాయ పోరాటం చేస్తోంది. చూస్తూండగానే ఎనిమిది నెలలు గడచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు ఆటోమేటిక్ గా అవుతుందని ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు ఒక బాంబు పేల్చారు.
దానికి వైసీపీ అధినేత జగన్ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. తాము అసెంబ్లీని బహిష్కరించలేదని విపక్ష హోదా మీద కోర్టుకు శాసనసభ స్పీకర్ సమాధానం చెప్పాలని కోరారు. ఇక అనర్హత మీద కూడా ఆయన పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీలో జగన్ కి అనర్హత వేటు భయం లేకపోయినా ఎమ్మెల్యేలలో కొంతమందికి ఉందని ప్రచారం సాగుతోంది. వారితో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం పట్ల అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు అని అంటున్నారు ఈసారి వైసీపీ నుంచి 11 మంది గెలిస్తే అందులో కొత్త వారు కూడా ఉన్నారు. విశాఖ నుంచి ఇద్దరు, కర్నూలు జిల్లా నుంచి ఒకరు, ప్రకాశం జిల్లా నుంచి మరొకరు ఇలా చూస్తే అయిదారుగురు దాకా కొత్త వారు కనిపిస్తున్నారు.
వీరికి అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్షా అని పిలవాలని ఉంది అని అంటున్నారు. రాజకీయ కారణాలతో అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. దాంతో వారిలో కొందరు వైసీపీ అధినాయకత్వం నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
మరి ఎవరైనా పార్టీ లైన్ దాటి కూటమి వైపు వస్తారా అన్నదే ప్రచారంగా ఉంది. వీరితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారని అలాగే కడపలో ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీ పోకడల పట్ల అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. దాంతో వీరిలో కొందరు కూటమి వైపు మొగ్గు చూపుతారు అన్న ప్రచారం సాగుతోంది. మరి అది నిజమవుతుందా అన్నది చర్చ అయితే ఉంది.
వైసీపీకి ఉన్నదే 11 మంది అయితే ఇందులో కూడా కొంతమంది వెళ్ళిపోతే ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం మరింతగా పడిపోతుందని అంటున్నారు వైసీపీ అధినాయకత్వం కోరుకుంటున్నట్లుగా ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వరు, దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళే చాన్స్ లేదు, మరి ఈ చిక్కుముడి వీడేది ఎలా అంటే అది తేలేది అయితే కాదు, కానీ 11 మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీ నుంచి వీడుతారు అన్నది మాత్రం ప్రచారంలో ఉంది. అది షాకింగ్ నంబర్ గానే ఉంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.