ఆమ్రపాలి పోస్టింగ్ ఎపుడు...ఎక్కడ ?
రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది. ఈ విషయంలో ఆమె చేసుకున్న అభ్యర్ధనలు వీగిపోగా ఏపీకి ఆమె వచ్చేశారు.
By: Tupaki Desk | 26 Oct 2024 6:30 AM GMTతెలంగాణా రాష్ట్రంలో డైనమిక్ ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరుని ఇమేజ్ ని తెచ్చుకున్న యువ అధికారిణి ఆమ్రపాలి ఎట్టకేలకు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది. ఈ విషయంలో ఆమె చేసుకున్న అభ్యర్ధనలు వీగిపోగా ఏపీకి ఆమె వచ్చేశారు.
అయితే ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ అయితే ఇప్పటిదాకా కేటాయించలేదు. ఆమె తెలంగాణాలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు. తనదైన శైలిలో ఆమె పాలన చేశారు. కోటి మందిని పైగా ఉన్న మహా నగరంలో ఆమె కీలక చర్యలు ఎన్నో తీసుకున్నారు. దాంతో అక్కడ అధికార యంత్రాంగం అంతా ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది.
రేన్వంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు మరింతగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి అధికారిణికి ఏపీ ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇస్తుంది ఎలా ఆమె సేవలను వినియోగించుకుంటుంది అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్ అధికారులను సమర్ధులైన వారి సేవలను వినియోగించుకునే విషయంలో ఎంతో ఆలోచిస్తారు. వారి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనుకుంటే కీ పోస్టులలో కూడా నియామకం చేస్తారు. అలా చూస్తే కనుక ఆమ్ర్పాలిని విజయవాడ నగరాభివృద్ధి సంస్థ కమిషనర్ గా నియమిస్తారు అన్న ప్రచారం ఉంది. అలా కాకపోతే ఆమెను విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ గా కూడా నియమిస్తారు అని అంటున్నారు.
అయితే మరో మాట ఏంటి అంటే ఆమె సేవలను తెలంగాణా ప్రభుత్వం కోరుకుంటే వారి విన్నపం మేరకు తిరిగి అక్కడికి పంపించేందుకు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తారు అని అంటున్నారు. ఎందుకంటే ఏపీ తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సామరస్యం స్నేహ భావం ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో అయితే ప్రస్తుతానికి పుకారుగా ఇది ఉంది.
ఏది ఏమైనా విభజన ఏపీలో మంచి అధికారులను వాడుకుని గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలన్న పట్టుదలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు అని అంటున్నారు. అందువల్ల ఆమ్రపాలి విషయంలో ఆయన ఆలోచనలు గురించి చర్చ సాగుతోంది. తొందరలోనే ఆమెకి మంచి పోస్టింగ్ ఇస్తారని అంటున్నారు.
జరుగుతున్న ఈ జాప్యం అంతా దాని కోసమే అని అంటున్నారు. సో ఏ ఐఏఎస్ అధికారి విషయంలో జరగనిడిస్కషన్ ఒక్క ఆమ్రపాలి విషయంలో భారీ ఎత్తున సాగుతోంది. అంటే కచ్చితంగా ఆమె డైనమిక్ ఆఫీసర్ కాబట్టే అని అంతా ఒప్పుకుంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.