దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్!
అవును... ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ ఎంత హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Aug 2024 5:57 AM GMTవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు స్టేట్ లో అతిపెద్ద టాపిక్ గా మారిందనే కామెంట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఊహించనన్ని మలుపులతో ఈ వ్యవహారం సాగుతోన్న పరిస్థితి. ఈ సమయంలో మాధురి కారు ప్రమాదానికి గురవ్వడం.. అది ప్రమాదం కాదు తానే కావాలని ఢీకొట్టినట్లు ఆమె ఎప్పడంతో అది మరో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ ట్విస్ట్ నెలకొంది.
అవును... ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ ఎంత హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దువ్వాడ ఇంటి ముందు అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె చేస్తున్న నిరసన దీక్ష నాలుగో రోజూ కొనసాగుతోంది. ఈ మేరకు వారు ఆరు బయటే పడుకుంటున్న పరిస్థితి. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాలపైనా కేసులు నమోదు చేసుకున్నాయి.
ఇక ప్రధానంగా ఆదివారం పలాస నేషనల్ హైవేపై కారు ప్రమాదం జరిగింది. అయితే అది ప్రమాదం కాదు తానే ఆత్మహత్యా యత్నం చేసినట్లు ఆమె వెల్లడించింది. ఆ సమయంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ఆమెను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.
అంతకముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాట్లాడిన ఆమె.. తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అలా చేసినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. తనను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని, వాణి మాటలతో తీవ్ర మనస్థాపం చెంది ఈ పనికి పూనుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్య డ్రైవింగ్ తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం... న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం పోలీసులు దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు. దీంతో.. దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో మరో కేసు నమోదైనట్లు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంలో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో.. ఎలాంటి ముగింపుకు వస్తుందో వేచి చూడాలి!