Begin typing your search above and press return to search.

దువ్వాడ ఫ్యామిలీ మేటర్... దివ్వల మాధురి ఆవేదన ఇది!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Aug 2024 5:36 AM GMT
దువ్వాడ ఫ్యామిలీ మేటర్... దివ్వల మాధురి ఆవేదన ఇది!
X

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. టెక్కిలిలో మొదలైన ఈ వ్యవహరం ఇప్పుడు వైరల్ ఇష్యుగా మారింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై పలు రకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. మరోపక్క తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ మాధురి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవును... దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా మారినట్లు చెబుతున్న మాధురి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇన్ స్టాలో ఆమె చేసిన రీల్స్, అందులోని ఆమె చేసిన డ్యాన్స్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి! ఈ నేపథ్యంలో... తనను ఇలా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్లు పెట్టడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె తనకు తాను రీల్స్ చేసుకుంటే ఎవరికి ఏమి ప్రాబ్లం వచ్చిందని ప్రశించిన మాధురి... తానేమైనా క్యాబరే డ్యాన్సులు చేస్తున్నానా.. లేక, పబ్ డ్యాన్స్ లు చేస్తున్నానా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. తమ ఇంట్లో తాను గుట్టుగా రీల్స్ చేసుకుంటే అందులో తప్పేమి కనిపించిందంటూ తనను ట్రోల్స్ చేసిన వారిని, ,తప్పుగా కామెంట్లు పెడుతున్నవారినీ ఆమె నిలదీస్తున్నారు.

ఇదే క్రమంలో... "రీల్స్ చేస్తే తప్పా..?" అని ప్రశ్నించిన ఆమె... తనపై జరుగుతున్న ట్రోలింగ్స్, వెకిలి పనులు తనను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్నాయని.. సోషల్ మీడియా చూస్తుంటే తనకు ఏడుపు వస్తుందని చెప్పిన ఆమె... ఇలా పర్సనల్ గా అటాక్ చేస్తూ కామెంట్లు ఎప్పుడూ పెట్టవద్దని ఆమె సూచించారు. రీల్స్ చేసే అమ్మాయిలంతా తప్పుడు పనులు చేస్తున్నాట్లేనా మీ ఉద్దేశ్యం అని ఆమె నిలదీశారు.

ఇక తాను వేల మంది పిల్లలకు భరత నాట్యం నేరించ్పినట్లు చెప్పిన మాధురి... అవన్నీ ఉచితంగానే చెప్పినట్లు తెలిపారు. ఇదే సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాటిస్పేట్ చేయడానికి తాను డబ్బులు ఖర్చుపెట్టుకుని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె తనను ట్రోల్స్ చేస్తున్నవారిపై ఆగ్రహ పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే... ఆమె ఆవేదనలో న్యాయముందని.. ఇలా ట్రోల్స్ చేయడం సరైంది కాదని పలువురు సూచిస్తున్నారు.