దుబాయ్‌లో దీపావళి ఎలా చేస్తారో తెలుసా?!
మన దేశంలో దీపావళి అనగానే.. పేరులో ఉన్నట్టుగా దీపాల వరుసలను వెలిగిస్తారు కదా! అదేవిధంగా దుబాయ్‌లో కూడా దీపాలను భారీ ఎత్తున వెలిగిస్తారు.
By: Tupaki Desk | 9 Nov 2023 10:55 AM GMTదుబాయ్. ఇదొక ఎడారి దేశం. పైగా ముస్లిం కంట్రీ. మరి అలాంటి చోట భారతీయ సంప్రదాయ పండుగైన దీపావళిని చేయడం ఏంటి? అనే సందేహం వస్తుంది. కానీ, నిజమే. దుబాయ్‌లోనూ దీపావళిని చేస్తారు. మన దగ్గర చేసే దానికన్నా కూడా ఎక్కువ ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఈ పండుగను నిర్వహిస్తారు. దీనికి కారణం.. ఇండియా నుంచి వలస వెళ్లిన వారు.. అక్కడ స్థిరపడిన వారు.. ఉద్యోగ , ఉపాధిని వెతుక్కుంటూ ఎడారి దేశం బాట పట్టిన వారు ఎక్కువగా ఉండడమే.
పైగా భారత్‌కు దుబాయ్ అత్యంత మిత్ర దేశం కావడం.. మన సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ కూడా గౌరవించడం వంటివి కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా.. దుబాయ్‌లో మన వాళ్లంతా దీపావళిని జరుపుకొంటారు. కేవలం మనవాళ్లే కాదు.. కొందరు ముస్లింలు కూడా.. ఈ పండుగలో పాలు పంచుకోవడం.. భారతీయులకు దుబాయ్ రాజు శుభాకాంక్షలు చెప్పడం.. వంటివి కూడా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే.
ఏం చేస్తారు?
మన దేశంలో దీపావళి అనగానే.. పేరులో ఉన్నట్టుగా దీపాల వరుసలను వెలిగిస్తారు కదా! అదేవిధంగా దుబాయ్‌లో కూడా దీపాలను భారీ ఎత్తున వెలిగిస్తారు. రంగురంగుల దీపాలను అందంగా పేరుస్తారు. ఇక్కడి లాగే అక్కడ కూడా మట్టి ప్రమిదలను వాడే సంప్రదాయం ఉంది. వీటిని ముస్లింలే అక్కడి గ్రామా ల్లో తయారు చేయడం మరో వింత. ఖరీదు కూడా చాలా తక్కువ. ఇక, దుకాణాలను కూడా దీపాలతో అలంకరిస్తారు. అయితే.. దీనికి విద్యుత్ దీపాలను వినియోగిస్తారు.
అంతేకాదు.. మన దగ్గర ఇప్పుడంటే.. దీపావళి సందడి.. కేవలం ఒకటి రెండు రోజులకే పరిమితం అయిం ది కానీ.. గతంలో కనీసం వారం ముందు నుంచి ఈ హడావుడి కనిపించేది. ఇప్పుడు మన దగ్గర లేకపోయి నా.. ఇక్కడ సంప్రదాయాన్ని దుబాయ్‌లో పాటిస్తున్నారు. వారం రోజుల ముందు నుంచి దీపావళి పండుగ కు సంబందించి కొత్త బట్టల కొనుగోళ్లు, మిఠాయిల తయారీ వంటివి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు.. భారతీయ సంప్రదాయ వంటకాలు రుచికరంగా తయారు చేయడం మరో విశేషం.
ప్రధాన ఆకర్షణ ఏంటంటే..
దుబాయ్ లో దీపావళికి ప్రధాన ఆకర్షణ.. బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం అనే సంగతి తెలిసిందే కదా! దీనిని కూడా రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరిస్తారు. ప్రధాన కట్టడాలు కూడా దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఇక, ఇప్పుడు మన దేశంలో కాలుష్యం కారణంగా బాణాసంచాపై కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. ఢిల్లీలో అయితే.. అసలు దీపావళి చేసుకోవద్దని చెబుతున్నారు. కానీ దుబాయ్‌లో బాణా సంచాపై ఎలాంటి నిషేధం లేదు. అంతేకాదు.. ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ఇదీ.. దుబాయ్ దీపావళి సంగతి!!