వీరంతా రాముడి వారసులైన లవకుశుల వారసులంట!
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jan 2024 8:05 AM GMTభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాం ప్రతిష్టించబడింది. ఈ సందర్భంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ క్రమంలో శ్రీరామువి వంశీయులం తామే అంటూ పలువురు ప్రకటించుకోవడం ఆసక్తిగా మారింది.
అవును... అయొధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టించబడుతున్న వేళ తామంతా రాముడి కుమారులైన లవుడు, కుశుడి వారసులం అంటూ ఇద్దరు తెరపైకి వచ్చారు. ఇందులో భాగంగా... తాము కుశుడి వారసులమని జైపూర్ రాజవంశీయురాలు దియా కుమారి చెబుతుండగా.. తాము లవుడి వారసులమని మేవార్ ఫ్యామిలీ మెంబర్ లక్ష్యరాజ్ చెబుతున్నారు. దీంతో వీరి వ్యవహారం ఆసక్తిగా మారింది.
కాగా... 2019 ఆగస్టు సమయంలో సుప్రీంకోర్టులో అయోధ్య భూ వివాదంపై రోజువారీ విచారణ జరుపుతున్న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం... "రఘువంశ"కి చెందిన ఎవరైనా ఇప్పటికీ ఆ పట్టణంలో లేదా మరెక్కడైనా నివసిస్తున్నారా అని తెలుసుకోవాలని కోరిన కొద్ది రోజుల తర్వాత దియా కుమారి, లక్ష్యరాజ్ సింగ్ లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా... రాముడి కుమారుడు కుష్ తో తన కుటుంబానికి ఉన్న సంబంధాలను రుజువు చేసే పత్రాలను కోర్టులో సమర్పించేందుకు ముందుకొస్తూ దియా కుమారి.. రాముడి కుమారుడు కుష్ నుండి వచ్చిన వారు తమ కుటుంబంతో సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారని చెబుతుంటారు!
ఇదే సమయంలో... నాడు ఇదే విషయంపై స్పందించిన లక్ష్యరాజ్ సింగ్... పురాతన కాలంలో లువ్ కోట్ (లాహోర్)ని స్థాపించిన రాముడి కుమారుడైన లవ్ వారసులం తామని తెలిపారు. ఇదిలా ఉండగా... రాఘవ్ రాజ్ పుత్ లు రాముడి నిజమైన వారసులని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యేంద్ర సింగ్ రాఘవ్ కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం నాడు వీరు మరోసారి తెరపైకి వచ్చారు.