Begin typing your search above and press return to search.

జగన్ విత్ డీకే...నీచులు అంటూ...!

గత కొంతకాలంగా నిప్పు లేని పొగ ఒకటి రాజకీయాల్లో రాజుకుంటోంది. అది జ్వాలగా మార్చే ప్రయత్నమూ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   1 July 2024 3:59 AM GMT
జగన్ విత్ డీకే...నీచులు అంటూ...!
X

గత కొంతకాలంగా నిప్పు లేని పొగ ఒకటి రాజకీయాల్లో రాజుకుంటోంది. అది జ్వాలగా మార్చే ప్రయత్నమూ జరుగుతోంది. అదిగో పులి ఇదిగో తోకా అన్న వార్తలు వ్యాప్తి చెందడం మామూలు వ్యవహారమే. అయితే వైసీపీ డిఫెన్స్ మోడ్ లోనే ఎపుడూ ఉంటుంది. దానికి ఆఫెన్సివ్ మోడ్ తెలియదు. వెళ్తే సూటిగా దూకుడుగా వెళ్ళడం లేదా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ డిఫెన్స్ లో ఉండడమే తెలుసు అని అంటారు.

అయితే వైసీపీ మీద పడ్డ మరకను కాంగ్రెస్ తుడిచే ప్రయత్నం చేసింది. అది తమకూ మచ్చ అని అనుకుందో లేదా మరేమి జరిగిందో తెలియదు కానీ జగన్ తో భేటీని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఖండించారు.

ఇది చాలా రోజులుగా వస్తున్న వార్త. జగన్ బెంగళూరు వెళ్లాక అదే పనిగా వస్తున్న వార్త. మాజీ మంత్రి పేర్ని నాని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఖండించా టీడీపీ అనుకూల చానళ్లలో డిబేట్లుగా మార్చిన వార్త. అలా వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అంటూ వస్తున్న ఆ వార్తల వేనక ఏ రాజకీయం ఉందో తెలియదు కానీ కాంగ్రెస్ మాత్రం తమకు ఈ తరహా పాలిటిక్స్ తో సంబంధం ఏముందని అనుకుందో ఏమో కానీ ఖండించింది.

డీకే విత్ జగన్ అంటూ వారి భేటీని ధృవపరచేలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను డీకే ఖండితంగా ఖండించేశారు. అవి ఫేక్ పోటోలు అని ఆయన అన్నారు ఎక్స్ వేదికగా డీకే డీకే దీనిమీద రియాక్ట్ అయ్యారు. కొందరు నీచులు ఫేక్ ఫోటోలు సృష్టించారు. దీనిని ఎవరూ నమ్మవద్దు అని ఆయన కోరారు.

నేను ఎపుడూ కూడా జగన్ ని కలవలేదు అని డీకే అంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు డీకే ద్వారా జగన్ రాయబారం చేసినట్లుగా ఒక పేపర్ కటింగ్ తో టీడీపీ జనసేన సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ చేస్తున్నాయి. వాటికి ఈ ఫోటో ఇపుడు తోడు అయింది.

అయితే డీకే మాత్రం ఇలాంటివి జరగలేదు అని అంటున్నారు. డీకే సౌత్ స్టేట్స్ కి సంబంధించి కాంగ్రెస్ కి ట్రబుల్ షూటర్. అంతే కాదు ఆ పార్టీకి అన్ని విధాలుగా ఆయనే అండదండలుగా ఉన్నారు. అలాంటి డీకే జగన్ తో భేటీ లేదు అని ఖండించారు అంటే కాంగ్రెస్ కి జగన్ తో ఏ రకమైన వార్తలు కలిపి రాసినా సహించేది లేదని ఇచ్చిన సందేశమా అని కూడా చర్చిస్తున్నారు.

కాంగ్రెస్ బలం సౌత్ లో బాగానే ఉంది. తెలంగాణాలో అధికారంలో ఉంది. ఏపీలో 2029 నాటికి పొలిటికల్ సినేరియో మారవచ్చు అన్న ధీమా ఉంది. అయినా కాంగ్రెస్ కండిషన్లు పెట్టి వచ్చే పార్టీలను ఎపుడూ చేరదీయదు. ఇక వైసీపీతో కాంగ్రెస్ కి ఎపుడూ పొసగదు అని అంటున్నారు.

జగన్ సైతం కాంగ్రెస్ వైపు చూడడానికే ఇష్టపడరని అంటున్నారు. కానీ ఈ రెండు పార్టీలను కలపి ఏపీ అధికార కూటమి నేతలు మాట్లాడుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా రాయాల్సింది రాస్తోంది. మరి వైసీపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిందా లేదా అన్నది పక్కన పెడితే దీని మీద డీకే ఖండన మాత్రం వైరల్ అవుతోంది. అదీని అర్ధాలు పరమార్ధాలు ఏంటి అన్న కొత్త చర్చకు కూడా డీకే ఇచ్చిన స్టేట్మెంట్ తెర తీసేలా ఉంది.