కాంగ్రెస్ ని లేపడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ?
రాజకీయాల్లో సాధారణంగా పోయిన చోటనే వెతుక్కుంటారు. అదే సక్సెస్ మంత్ర కూడా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో చిత్తు అయింది.
By: Tupaki Desk | 8 July 2024 3:00 AM GMTకాంగ్రెస్ ని లేపే పనిని చాలా వ్యూహాత్కమంగా ఇద్దరు ముఖ్య్యమంత్రుల చేతిలో కాంగ్రెస్ అధినాయకత్వం పెట్టిందా అంటే అవును అనే ప్రచారంలో ఉన్న మాట. ఏపీలో కాంగ్రెస్ కి కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని మళ్లీ పునర్ నిర్మించుకునే పనిలో ఆ పార్టీ ఉంది.
రాజకీయాల్లో సాధారణంగా పోయిన చోటనే వెతుక్కుంటారు. అదే సక్సెస్ మంత్ర కూడా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో చిత్తు అయింది. అందులో తెలంగాణాలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ని కుదేల్ చేసిన బీఆర్ఎస్ ని మూలన పెట్టేసింది. ఆ పార్టీ మళ్లీ ఎదగకుండా ఏమి చేయాలో అన్నీ చేస్తోంది.
ఇక ఏపీలో చూస్తే వైసీపీ వల్లనే కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తిన్నది. 2011 నుంచి ఏపీ లో కాంగ్రెస్ కి చెడ్డ రోజులు మొదలయ్యాయి. అవి అలా కంటిన్యూ అవుతూ ఒక పుష్కర కాలం దాకా వెంటాడాయి. కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగానే ఆలోచించింది. వైసీపీని ఏపీ గద్దె మీద నుంచి దించినపుడే మళ్ళీ హస్త రేఖలు మారుతాయని తాను బలంగా నమ్మింది.
పైగా ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెతను కూడా విశ్వసిస్తోంది. అందువల్లనే వైఎస్సార్ ఫ్యామిలీ నుంచే షర్మిలను తెచ్చి అన్న జగన్ కి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసింది. సొంత చెల్లెలు అన్న మీద చేసిన విమర్శలు జనంలోకి బాగా వెళ్లాయి. దాంతో ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయింది.
ఇపుడు వైసీపీ భారీ పరాజయంతో అయోమయంతో ఉంది. దీంతో కాంగ్రెస్ వైసీపీని మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలని తాను కోల్పోయిన ఓటు బ్యాంక్ ని పూర్తిగా దగ్గరకు చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. దాంతో వైఎస్సార్ లెగసీ మొత్తం తన వైపు ఉండేలా చూసుకుంటోంది.
వైఎస్సార్ 75వ జయంతిని పెద్ద ఎత్తున విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్ తమ వాడే అని చాటడమే కాకుండా ఆయన 2004 నుంచి 2009 దాకా పాలించిన పాలనను సంక్షేమ రాజ్యాన్ని తెచ్చే సత్తా తమకే ఉందని చెప్పుకోవాలని చూస్తోంది. మంచి పాలనా దక్షుడిగా వైఎస్సార్ కి ఏపీ జనంలో ఉన్న ఇమేజ్ ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.
ఈ నేపధ్యంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ జయంతిని కాంగ్రెస్ రాజకీయ రాజధాని విజయవాడ నడిబొడ్డున నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా తెలంగాణా సీఎం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరవుతారు అని అంటున్నారు. అలాగే తెలంగాణాకు చెందిన మంత్రులు చాలా మంది హాజరవుతారని అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే బాధ్యత అలా డీకే రేవంత్ రెడ్డిల మీద హై కమాండ్ పెట్టింది అని అంటున్నారు. వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తూ ఏపీలో ట్రబుల్ షూటర్ డీకే వైసీపీని టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. వైసీపీ నుంచి మాజీ కాంగ్రెస్ వాదులను ఆయన వెనక్కి రప్పిస్తారు అని అంటున్నారు.అలాగే బీసీ నేత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఏపీ మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు.
అలాగే పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకునేలా తన వంతుగా ఒక చేయి వేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు కీలక నేతలకే ఏపీలో కాంగ్రెస్ ని లేపే బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. రానున్న రోజులలో కాంగ్రెస్ ఏపీలో మరింతగా దూకుడు చేస్తుందని అంటున్నారు. దానికి నాందిగా వైఎస్సార్ జయంతి వేడుకలను వేదిక చేసుకోనున్నారు అని అంటున్నారు.