డీఎంకే వర్సెస్ బీజేపీ... విమానంలో సీటు కోసం ఫైటు!
అవును... తమిళనాడులో ఎయిరిండియా విమానంలోని సీటు మార్పు విషయంలో రాజకీయం వేడెక్కింది. దీంతో... డీఎంకే - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 14 Feb 2025 3:33 PM GMTకాదేదీ రాజకీయ విమర్శలకు అనర్హం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. పాలిటిక్స్ లో ప్రత్యర్థులు ఏ విషయంపై స్పందించినా.. అందులోని రాజకీయ కోణంలోనే అవతలివారు స్పందిస్తుంటారని అంటారు. ఈ సందర్భంగా.. తాజాగా ఓ విమాన టిక్కెట్ విషయంలో తమిళనాడులో రెండు రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరాయి.
అవును... తమిళనాడులో ఎయిరిండియా విమానంలోని సీటు మార్పు విషయంలో రాజకీయం వేడెక్కింది. దీంతో... డీఎంకే - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన సమస్య సంగతి అటుంచితే.. కారణం సిల్లీగా ఉందా అనే చర్చ మొదలైందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె బిజినెస్ క్లాస్ సీటును రద్దు చేసిన ఎయిరిండియా.. ఆమెకు ఎకానమీ సీటు కేటాయించారు. దీంతో... ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఒక ఎంపీకే విమానంలో ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. తన విమాన టిక్కెట్ తరగతిని ఎలా తగ్గిస్తారంటూ ఆమె ఎక్స్ వేదికగా నిలదీశారు. దానికి ఎయిరిండియా సంస్థ స్పందించిందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై మాత్రం స్పందించారు.
ఇందులో భాగంగా... ఎంపీ తంగపాండియన్ కు అలా జరిగి ఉండాల్సింది కాదని అంటూనే విమర్శలు అందుకున్నారు. కేవలం విమానంలో టిక్కెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు.. తమిళనాడు ప్రభుత్వ పాలనలో ప్రజల స్థాయి ఎంతగా తగ్గిందో చెప్పడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలిపారు.
నేను ఒక ఎంపీని.. నా పరిస్థితే ఇలా ఉంటే.. అని మాట్లాడటం వంశపారంపర్య రాజకీయాల ఫలితంగా వచ్చిన వ్యక్తి ఔన్నత్యాన్ని సూచిస్తుందని తెలిపారు. దీంతో... ఎక్స్ వేదికగా డీఎంకే వర్సెస్ బీజేపీ వార్ మొదలైంది. దీంతో... ఎక్కడ మొదలైన వ్యవహారం ఎక్కడకు వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!