టాయిలెట్ ప్రారంభోత్సవం: ఆ ఎమ్మెల్యేకు 500 నోట్ల దండలతో స్వాగతం!
ప్రారంభోత్సవాలకు, శంకు స్థాపనలకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముందుంటారన్న విషయం తెలి సిందే.
By: Tupaki Desk | 14 April 2025 8:30 PMప్రారంభోత్సవాలకు, శంకు స్థాపనలకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముందుంటారన్న విషయం తెలి సిందే. ఈ సందర్భంగా వారి వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గజమాలలు.. పూల దండలు.. స్వాగత తోరణాలు.. జయ జయ ధ్వానాలు.. భాజాలు.. భజంత్రీలు ఇలా.. పెద్ద ఎత్తున హంగామా సృష్టిస్తారు. తమ నాయకుడిని ఫొటోలు, వీడియోలు కూడా తీసుకుని తరిస్తారు. అయితే.. ఎంత ప్రారంభోత్సవం అయినా.. కొన్ని కొన్ని విషయాల్లో కొంత లిమిట్ పాటించాలి.
కానీ, తమిళనాట అధికార పార్టీ డీఎంకే నేతలు.. మాత్రం చావుకు-పెళ్లికి ఒకటే మేళం అన్నట్టుగా తయార య్యారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా స్టాలిన్ ప్రభుత్వం బహిరంగ మల, మూత్ర విసర్జన శాలలను నిర్మించిం ది. ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఇవి చేస్తున్నారన్న విపక్షాల విమర్శలను పక్కన పెట్టి.. కొంత పరిస్థితిని మెరుగు పరిచే చర్యలు చేపట్టింది. అయితే.. ఈ విషయంలోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని కథనాలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సాక్షాత్తూ సీఎం స్టాలిన్ ప్రారంభించిన బహిరంగ టాయిలెట్‌లో రెండు కమోడ్ లు పక్క పక్కనే ఏర్పాటు చేసి ఉండడంతో ఆయన దానిని ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. ఇదెలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించడం కూడా.. పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలావుంటే.. ఇదే డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే అన్బురాజన్.. తన నియోజకవర్గంలో కూడా.. పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. వీటిని ఆయన తాజాగా ప్రారంభించారు.
అయితే.. సాధారణంగా ఏ కల్యాణ మండపాన్నో .. ప్రభుత్వ పాఠశాలనో.. నీటి పారుదల ప్రాజెక్టునో ఆయ న ప్రారంభించేందుకు వచ్చారన్నట్టుగా.. ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రూ.500 నోట్లతో తయారు చేసి పెద్ద పెద్ద దండలను ఆయనకు అలంకరించి.. ఓ పెద్ద జేసీబీతో వేల కిలోల పూవులను ఆయనపై చిలకరించి.. పెద్ద పండుగే చేశారు. తీరా.. ఆయన ప్రారంభించింది.. ఏంటంటే.. సింగిల్.. టాయిలెట్. అంటే.. బహిరంగ మల విసర్జన గది! ఇదీ.. డీఎంకే నేతల పరిస్థితి అంటూ.. పెద్ద ఎత్తున ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.