Begin typing your search above and press return to search.

యూఎస్ లో భారతీయ హెచ్-1బీ వైద్యుల అవసరం ఎంతంటే..?

1982లో స్థాపించబడిన ఈ ఏఏపీఐ భారత సంతతికి చెందిన 1,20,000 వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 10:30 PM GMT
యూఎస్ లో భారతీయ హెచ్-1బీ వైద్యుల అవసరం ఎంతంటే..?
X

మరో నెల రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు యూఎస్ సిద్ధమవుతోన్న తరుణంలో ఇమ్మిగ్రేషన్, హెల్త్ కేర్ సంస్కరణలతో పాటు గ్రీన్ కార్డులను వేగంగా ట్రాక్ చేయడం వంటి మొదలైన విషయాల్లో తదుపరి పరిపాలన ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) చీఫ్ వెళ్లడించారు.

అవును... భారతీయ సంతతికి చెందిన వైద్యుల కోసం ఏర్పాటు చేసిన ఏఏపీఐ చీఫ్ డాక్టర్ సతీష్ కథుల తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ యూఎస్ లో భారతీయ వైద్యుల అవసరం, వారికున్న సమస్యలు, వారు వెళ్లిపోతే ఎదురయ్యే ఇబ్బందు, మొదలైన విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా హెచ్-1బీ వైద్యుల ప్రస్తావన తెచ్చారు.

ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ సతీష్... ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ, వీసా సమస్యలు, ఇమిగ్రేషన్ సమస్యలు, వైద్య రంగంలో సాంకేతికత, వివక్షకు వ్యతిరేకత వంటి అంశాలు తదుపరి వైట్ హౌస్ పరిపాలన ద్వారా ప్రాధాన్యత ఇవ్వబడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు!

1982లో స్థాపించబడిన ఈ ఏఏపీఐ భారత సంతతికి చెందిన 1,20,000 వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. చాలా మంది వైద్యులు సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా హెచ్-1బీ వర్క్ వీసాలపై ఉన్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్థావించారు. ఈ సమయంలో వారి గ్రీన్ కార్డ్ ప్రక్రియను వేగవంతం చేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.

వీరంతా యూఎస్ లో నివసించేలా.. వారి వీసా పరిస్థితి గురించి చింతించకుండా వారి వారి పనులకు కొనసాగించగలరని నిర్ధారించుకోవడానికి గ్రీన్ కార్డులను వేగంగా ట్రాక్ చేయాలని సూచించారు. ఈ హెచ్-1బీ వర్క్ వీసాపై ఉన్న వేలాది మంది వైద్యులు స్థానిక వైద్యులు వెళ్లని చోట్ల సేవలు అందిస్తున్నారని తెలిపారు!

వీరు నిజంగా వెళ్లిపోతే.. కొన్ని పట్టణాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూలిపోతుందని.. అందుకే గ్రీన్ కార్డులను వేగంగా ట్రాక్ చేయాలని, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇది చాలా ముఖ్యమని సతీష్ నొక్కి చెప్పారు! యూఎస్ లో హెచ్-1బీ వైద్యులపై పూర్తిగా ఆధారపడిన కొన్ని సంఘాలూ ఉన్నాయని తెలిపారు.

ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో వైద్యుల కొరతపైనా ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ సతీష్... 2030 నాటికి యూఎస్ లో సుమారు 1,25,000 మంది వైద్యులు అవసరం కావొచ్చని చెబుతూ.. కొత్త వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు మరిన్ని మెడికల్ కాలేజీలు, రెసిడెన్సీ స్థానాలు ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో అమెరికాలోని భారతీయ సమాజం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. వచ్చే ప్రభుత్వం ఈ విషయాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వాలని.. ఏఏపీఐ ఎదురుచూస్తోందని ఆయన అన్నారు!