పవన్ ఇక ఢిల్లీ వెళ్లాల్సిందేనా ?
ఇక పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు మేరకు లేటెస్ట్ గా మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.
By: Tupaki Desk | 25 Nov 2024 11:30 PM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఇక మీదట ఢిల్లీ టూర్లు తప్పేట్లు లేవు. ఎందుకంటే ఆయన పొలిటికల్ పవర్ అలాంటిది మరి. పవన్ తెలుగు గేటు దాటి మహరాష్ట్రలో చేసిన తొలి ఎన్నికల ప్రచారంలోనే సంచలనం రేకెత్తించారు. ఆయన ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్ పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల బీజేపీ అత్యధిక మెజారిటీని సొంతం చేసుకుంది.
దాంతో పవన్ మేనియా ఏంటో కమలనాధులకు కళ్ల ముందు కనిపించింది. బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, ఎన్డీయే మిత్రులలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇక చూస్తే ఎన్డీయే కూటమిలో అతి కొద్ది మందికే జనాకర్షణ అమితంగా ఉంది. ఇపుడు ఆ లిస్ట్ లో పవన్ చేరిపోయారు.
దాంతో పవన్ కి ఢిల్లీతో పెద్ద పని పడింది. పవన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో సూపర్ సకెస్ అయ్యారు. దాంతో పవన్ స్టామినా ఏంటో తెలిసి వచ్చిన బీజేపీ ఇక ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వదిలేయరాదు అని ఫుల్ గా డిసైడ్ అయింది అని అంటున్నారు.
ఇక పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు మేరకు లేటెస్ట్ గా మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. అంతే కాదు ఆయన ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారు అని అంటున్నారు.
ఇక బీజేపీ పవన్ కళ్యాణ్ కి కొత్తగా మరి కొన్ని టాస్కులు అప్పగిస్తుందని అంటున్నారు. బీజేపీకి తమిళనాడు కొరుకుడు పడని స్టేట్ గా ఉంది. ఆ స్టేట్ లో కమలాన్ని లేపీ బాధ్యతను పవన్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఇటీవల సనాతన ధర్మం విషయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టేట్మెంట్ నే కౌంటర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు.
అంతే కాదు దివంగత నేత తమిళుల ఆరాధ్య దైవం ఎంజీఆర్ తన అభిమాన నేత అని ఒకటికి పదిసార్లు పవన్ గొప్పగా చాటుకున్నారు. దాంతో తమిళనాడులో బీజేపీకి 2026లో జరిగే ఎన్నికల మీద పెద్దాశలే ఉన్నాయని అంటున్నారు. దానిని సాకారం చేసేందుకు పవన్ కళ్యాణ్ నే ముందు పెట్టాలని ఆలోచిస్తోందని అంటున్నారు
అంతే కాదు తెలంగాణాతో పాటు కర్ణాటక కేరళ వంటి చోట్ల బీజేపీ కొత్త రాజకీయ శకం మొదలెట్టడానికి పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారుట. మొత్తానికి చూస్తే పవన్ ని బీజేపీ అగ్ర నేతలు ఏపీలో ఉండనిచ్చేలా లేరు అని అంటున్నారు.
పవన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. పవన్ కి అయితే మోడీ అంటే ఆరాధనాభావం ఉంది. పైగా ఆయన సనాతన ధర్మం పట్ల పూర్తి అనురక్తితో ఉన్నారు. దాంతో ఉభయకుశలోపరిగా పవన్ బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ని అనుసరించి తన వంతు బాధ్యతలు నిర్వహిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ రాజకీయ చిత్ర పటం మీద పవన్ ని నిలపాలని బీజేపీ చేస్తున్న ఆలోచనలు తొందరలోనే కార్యరూపం దాల్చనున్నాయని అంటున్నారు.