Begin typing your search above and press return to search.

చనిపోయిన యజమాని కోసం పస్తులతో శునకం... వీడియో వైరల్!

అయితే చికిత్స చేయించినా ఫలితం లేక సదరు వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 6:01 AM GMT
చనిపోయిన యజమాని కోసం  పస్తులతో  శునకం... వీడియో వైరల్!
X

మనుషులకూ శునకాలకూ ఏదో అవినాభావ సంబంధం ఉందని అంటుంటారు. విశ్వాసంలో శునకాలకు ఫస్ట్ మార్కులు వేస్తారు. కారణం... మనుషులపై అవి చూపించే విశ్వాసం ఆ స్థాయిలో ఉంటుంది. కొంతమందికైతే శునకం అంటే... ఇంటిలో సభ్యుడే! వాటికీ బర్త్ డేలు చేయడం, చనిపోతే శాస్త్రోక్తంగా కర్మకాండలు జరిపించడం కూడా చేస్తుంటారు. అందుకు శునకాలకంటే పెద్ద అర్హత ఉన్న జంతువు మరొకటి లేదని చెబుతుంటారు.

ఈ సమయంలో అనారోగ్యంతో అస్పత్రిలో చేరిన తన యజమాని నెలలు గడుస్తున్నా బయటకు రావడంలేదని, కంటికి కనిపించడం లేదని ఒక శునకం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంది. ఎక్కడికీ వెళ్లకుండా.. తిండికూడా సరిగా తినకుండా ఆస్పత్రి ఎదుటే పడిగాపులు కాస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసినవారు... ఇది ఏ జన్మ సంబంధమో అని కామెంట్లు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని కన్నూరు జిల్లాలో ఒక వ్యక్తికి అస్వస్థతగా ఉంటంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో అతనితో పాటు పెంపుడు కుక్క "రాము" తన యజమానితోపాటు ఆస్పత్రివద్దకు వచ్చింది. అయితే చికిత్స చేయించినా ఫలితం లేక సదరు వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

అనంతరం ఆ మృతదేహాన్ని ఆస్పత్రి వెనుక ఉన్న మార్చురీ నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు అతని కుటుంబ సభ్యులు. అయితే ఈ విషయం గ్రహించలేదో ఏమో కానీ "రాము" మాత్రం యజమాని ఎప్పటికైనా బయటకు వస్తాడని తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడనే ఆస్పత్రి వద్దే ఉండి ఎదురుచూస్తోంది. అలా ఒకరోజు వారం రోజులో కాదు సుమా... ఏకంగా నాలుగు నెలలుగా అలానే ఎదురుచూస్తోంది.

దీంతో ఈ శునకం బాధ అర్థం చేసుకున్న వికాస్ అనే ఆస్పత్రి సిబ్బంది దానికి బిస్కెట్లు వంటివి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అది తినటం లేదు. దీంతో... యజమాని అంటే దానికి ఎంత ఇష్టమో, మరెంత ప్రేమో తెలుస్తోంది అని అంటున్నాడు. ఈ క్రమంలో మార్చురీ రూము బయట సుమారు నాలుగు నెలలుగా అది అలానే వేచి చూస్తోందని.. యజమాని ఇంకా బతికే ఉన్నాడని వస్తాడని అనుకుంటోందని చెబుతున్నాడు వికాస్.

అయితే మొదట్లో ఆ కుక్కను తాను పట్టించుకోలేదనీ.. కానీ తర్వాత పరిశీలిస్తే యజమాని రాక కోసం ఎదురు చూస్తోందని తెలిసి చాలా బాధ కలుగుతోందని అన్నాడు. ఈ విషయం తెలిసినప్పనుంచి దానికి ఆహారం పెట్టినా తినలేదని.. బిస్కెట్లు వంటివి పెడితే ప్రాణం నిలుపుకోవడానికన్నట్లుగా కాస్త తిని మిగిలినవి వదిలేస్తోందని చెబుతున్నాడు. దీంతో కుక్కలు ఎంతటి విశ్వాసం కలవో ఇలాంటి సందర్భాల్లో అర్థమవుతోందని వికాస్ తెలిపాడు.

ఈ సమయంలో "రాము"కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిస్తే ఆ శునకం పరిస్థితి ఏమిటనే కామెంట్లు చేస్తున్నారు. నచ్చచెప్పేవాళ్లూ, ఓదార్చే వాళ్లూ కూడా ఉండరుకదా!!