టీడీపీ ఫైర్ బ్రాండ్‌కు ఇలా చెక్ పెడుతున్నారా? : వైసీపీలో టాక్
అందుకే వైసీపీ తన హిట్ లిస్ట్‌లో కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులును కూడా చేర్చింది
By: Tupaki Desk | 18 Aug 2023 1:30 PM GMT''అధ్యక్షా.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గుడి, బడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు, వైన్ షాపులు నడుస్తున్నాయి'' అంటూ.. వైసీపీ సర్కారుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు గుర్తుండే ఉంటారు. తరచుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పాల్గొంటారు. టీడీపీ తరఫున ఎంత వరకైనా అనే టైపులో తెగించి పోరాటం చేస్తారు.
అందుకే వైసీపీ తన హిట్ లిస్ట్‌లో కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులును కూడా చేర్చింది. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఆయనను చిత్తుచిత్తుగా ఓడించాలనేది వైసీపీ వ్యూహం. ఇప్పటికే అనేక కేసులు కూడా నమోదైన.. డోలా.. ప్రజల కోసం తలవంచేదే లేదని తెగేసి చెబుతున్నారు. సరే.. ఈ విషయం ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో డోలాను ఓడించేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారనే చర్చ వైసీపీలో సాగుతోంది.
ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, కమ్ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్.. ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇదేసమయంలో ఆయన తరచుగా కొండపి నియోజకవర్గంపై కన్నేస్తున్నారు. ఇక్కడ ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు అంటూ.. ఇక్కడ తిరుగుతున్నారు. దీంతో వైసీపీలో జరుగుతున్న చర్చ నిజమే అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఒకవేళ.. కొండపి నుంచి ఆదిమూలపు సురేష్ పోటీ చేసినా.. ఫలితం లేదని టీడీపీ వర్గాలు అంటున్నారు.
ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గంలోనూ శాశ్వతంగా ఆదిమూలపు పనిచేయలేదని, ఆయన ఏ నియోజక వర్గంలోనూ డెవలప్ చేసిన పరిస్థితి లేదని అంటున్నారు. ప్రతి ఎన్నికకు తన నియోజకవర్గాన్ని మార్చే స్తున్నారని.. సో.. ఆయన వల్ల ప్రజలకు ఏమో ఒరగదని అంటున్నారు. నియోజకవర్గంలో వరుస విజయా లు దక్కించుకుని.. ఇక్కడ అన్ని విధాలా ప్రజలకు చేరువ అవుతున్న డోలా బాల వీరాంజనేయ స్వామి ని ఢీకొట్టడం వైసీపీకి సాధ్యం కాదని అంటున్నారు టీడీపీ నాయకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.