Begin typing your search above and press return to search.

పెంపుడు జంతువులతో జాగ్రత్త.. భారత్ లో పిల్లికి సోకిన వైరస్!

వైరస్ అనే పదం వినిపిస్తే ప్రపంచం మొత్తం వణికిపోవడం కోవిడ్-19 నుంచి ఎక్కువగా మొదలైందన్నా అతిశయోక్తి కాదేమో.

By:  Tupaki Desk   |   28 Feb 2025 2:45 AM GMT
పెంపుడు జంతువులతో జాగ్రత్త.. భారత్ లో పిల్లికి సోకిన వైరస్!
X

వైరస్ అనే పదం వినిపిస్తే ప్రపంచం మొత్తం వణికిపోవడం కోవిడ్-19 నుంచి ఎక్కువగా మొదలైందన్నా అతిశయోక్తి కాదేమో. ఆ ముచ్చట ముగిసిందని భావిస్తోన్న వేళ.. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు భయపెడుతోంది. దీంతో.. పలు చోట్ల ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఈ సమయంలో తాజాగా దేశంలో పిల్లికి బర్డ్ ఫ్లూ సోకిన విషయం తెరపైకి వచ్చింది.

అవును... ప్రస్తుతం భారత్ లో బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతోందని అంటున్నారు. ఈ సమయంలో పలు రాష్ట్రాలు ఈ విషయలో చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే క్రమంలో.. ఇటీవల ఏపీలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందనే ప్రచారం జరగడంతో ఆందోళన నెలకోంది. అయితే.. అది అసత్య ప్రచారమని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ పెంపుడు జంతువులకు సోకిన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మధ్యప్రదేశ్ లో ఓ పెంపుడు పిల్లికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని తెలుస్తోంది. చింద్వారా జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఓ పెంపుడు పిల్లిలో కనిపించిందని అంటున్నారు. దీంతో.. ఈ విషయం తీవ్ర కలకలం రేపింది.

వాస్తవానికి ఈ హెచ్5ఎన్1 వైరస్ పక్షులకు సంక్రమించేది అయినప్పటికీ.. పాలిచ్చే జంతువులలో కూడా పెరుగుతోందని అంటున్నారు. వాస్తవానికి జనవరిలోనే చింద్వారా జిల్లాలో కేంద్ర ఎనిమల్ హస్బెండరీ శాస్త్రవేత్తలు ఈ కేసులను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ఫ్లూ కోళ్లకు మాత్రమే వస్తుందని చెబుతున్న వేళ పిల్లులకు కూడా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.

ఈ వైరస్ సోకిన పిల్లులకు మూడు రోజుల్లోనే తీవ్రమైన జ్వరంతో పాటు ఆకలి మందగించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో.. పెంపుడు జంతువులకు జ్వరం వచ్చినా, యాక్టివ్ నెస్ తగ్గినట్లు కనిపించినా వైద్య పరీక్షలు చేయించడం ఉత్తమమని అంటున్నారు.