Begin typing your search above and press return to search.

డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ ఇదే... మెజరిటీ మెంబర్స్ బిలియనీర్సే!

తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికన్ల కంటే ఎక్కువగా ప్రపంచ దేశాలకు సంబంధించినవీ, వాటిని ప్రభావితం చేసేవీ ఉన్నాయనే చర్చా తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 8:30 AM GMT
డొనాల్డ్  ట్రంప్  కేబినెట్  ఇదే... మెజరిటీ మెంబర్స్  బిలియనీర్సే!
X

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. పరిపాలనలో అప్పుడే తనదైన దూకుడు చూపిస్తున్నారు. ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసిన ట్రంప్.. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో "అమెరికా ఫస్ట్" నినాదం అంతర్లీనంగా స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికన్ల కంటే ఎక్కువగా ప్రపంచ దేశాలకు సంబంధించినవీ, వాటిని ప్రభావితం చేసేవీ ఉన్నాయనే చర్చా తెరపైకి వచ్చింది. ఆ విధంగా ట్రంప్ ముందుకు దూసుకుపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ ఎఫెక్ట్ తో భారత్ లో దేశీయ స్టాక్ మార్కెట్ లో సుమారు రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైందని అంటున్నారు.

దీనికి కారణం... పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించడమే. ఇదే సమయంలో భారత్ సహా పలు దేశాలపైనా సుంకాల విధింపు తప్పదని గతంలోనే చేసిన వ్యాఖ్యల ప్రభావం పుష్కలంగా ఉందని అంటున్నారు. మరోవైపు ట్రంప్ కేబినెట్ పైనా ఆసక్తీకరమైన చర్చ జరుగుతుంది.

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. తన కేబినెట్ కూర్పులో ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... 24 మందితో తన రెండో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్న ట్రంప్.. వారిలో 13 మంది బిలియనీర్లు కావడం గమనార్హం. ఈ మేరకు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో భాగంగా... ఆక్స్ పాయ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

కాగా... స్వతాహగా రియల్ ఎస్టేట్ తో పాటు హోటళ్లు, క్యాసినో మొదలైన రకరకాల వ్యాపారాలతో సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ కం బిలియనీర్ అయిన ట్రంప్.. తన కేబినెట్ ను కూడా ఇలా బిలియనీర్ల మయం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ రెండో మంత్రివర్గ! (పేరు - పదవి - రాష్ట్రం/ప్రాంతం)

జేడీ వాన్స్ – వైస్ ప్రెసిడెంట్ - ఓహియో

మార్క్ రూబియో – స్టేట్ సెక్రటరీ - ఫ్లోరిడా

స్కాట్ బెసెంట్ – స్టేట్ ట్రెజరీ – సౌత్ కరోలినా

పీట్ హెగ్ సేత్ - రక్షణ కార్యదర్శి - టెనస్సీ

పామ్ బోండీ - అటార్నీ జనరల్ - ఫ్లోరిడా

బర్గమ్ - ఇంటీరియర్ సెక్రటరీ - నార్త్ డకోటా

బ్రూక్ రోలిన్స్ - అగ్రికల్చరల్ సెక్రటరీ - టెక్సాస్

హోవార్డ్ లుట్నిక్ - వాణిజ్య కార్యదర్శి – న్యూయార్క్

లోరీ చావేజ్ – లేబర్ సెక్రటరీ - ఒరెగాన్

రాబర్ట్ ఎఫ్ కెనడీ జూ. - ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి - కాలిఫోర్నియా

స్కాట్ టర్నర్ - హౌసింగ్ & అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ - టెక్సాస్

సీన్ డఫీ - రవాణా కార్యదర్శి - విస్కాన్సిన్

క్రీస్ రైట్ - ఎనర్జీ కార్యదర్శి - కొలరాడో

లిండా మెక్ మాన్ - విద్యా కార్యదర్శి - కనెక్టికట్

డౌగ్ కాలిన్స్ – వెటరన్ అఫైర్స్ సెక్రటరీ - జార్జియా

నోయెం – హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ – సౌత్ డకోటా

క్యాబినెట్ స్థాయి అధికారులు!:

సూసీ వైల్స్ – వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ - ఫ్లోరిడా

లీ జెల్డిన్ – ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేటర్ - న్యూయార్క్

రస్సెల్ వోట్ – ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ & బడ్జెట్ డైరెక్టర్ - వర్జీనియా

తులసీ గబ్బర్డ్ - డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ - హవాయి

జాన్ రాట్ క్లిఫ్ - సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ - టెక్సాస్

జామిసన్ గ్రీర్ – యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ – వాషింగ్టన్ డీసీ

ఎలిస్ స్టెఫానిక్ - ఐక్యరాజ్యసమితి రాయబారి - న్యూయర్క్

కెల్లీ లోఫ్లర్ – స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ - జార్జియా