Begin typing your search above and press return to search.

ట్రంప్ 2.0... భారత్ ప్లస్ లు మైనస్ లపై ఎక్స్ పర్ట్స్ వ్యూస్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభర్థి ట్రంప్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Nov 2024 3:58 AM
ట్రంప్ 2.0... భారత్  ప్లస్ లు మైనస్ లపై ఎక్స్ పర్ట్స్ వ్యూస్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభర్థి ట్రంప్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేసే చట్టాలు, ఎంచుకునే విధానాలు.. భారత్ సహా ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రధానంగా ట్రంప్ ఎన్నికల అజెండా "అమెరికా ఫస్ట్" అమలైతే.. చైనాతోపాటు ఇతర దేశాల ఉత్పత్తులకూ సుంకాల బెడద తప్పదని అంటున్నారు. అమెరికా ఉత్పత్తులకు ఆయా దేశాలూ ఎంత టారిఫ్ లు విధిస్తే.. వాటికి తగ్గట్లుగానే అమెరికా వసులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కు కొన్ని మేలులూ ఉన్నాయి.. మరిన్ని సమస్యలూ ఉన్నాయని అంటున్నారు.

అవును... ట్రంప్ 2.0 పాలనలో భారత్ కు కలిగి కొన్ని మేలులూ ఉన్నాయి, ఇంకొన్ని కీడులూ ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ్... చైనాపై అమెరికా కఠిన వైఖరి కచ్చితంగా భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు సృష్టించొచ్చని అన్నారు. ఫలితంగా అమెరికాకు ప్రత్యామ్నాయ సరఫరాదారుగా భారత్ పాత్ర పెరగొచ్చని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... అమెరికా జీడీపీకి 80 బిలియన్ డాలర్ల సహకరాని భారత్ ఐటీ రంగం అందిస్తోందని.. ఇరుదేశాల మధ్య సాంకేతిక సహకారం, బంధం ఎప్పటిలాగానే కొనసాగుతుందని.. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో మ్యూచువల్ కోపరేషన్ ఉంటుందని అంటున్నారు నాస్కాం ఛైర్ పర్సన్ సింధు గంగాధరన్.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎత్తుకున్న నినాదాల్లో అతంత ప్రభావవంతమైన వాటిలో ఒకటి "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" ఈ నినాదాన్ని ట్రంప్ అనుసరిస్తే... తమ దేశంలోకి వచ్చే ఎగుమతులపై టారిఫ్ లు కచ్చితంగా పెంచుతారు. ఇది ఎలాక్ట్రానిక్స్ లాంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు విశ్వజిత్ ధార్.

ఇదే సమయంలో... అమెరికా ఫస్ట్ నినాదంతో జౌళి, రసాయనాలు, వాహన, ఔషధం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదార్లు అధిక సుంకం చెల్లించాల్సి రావచ్చని.. భారత్ ప్రత్యామ్నాయ విపణులపై దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు ఈవై ఇండియా నుంచి అగ్నేశ్వర్ సైన్.

అయితే... అంతరిక్ష, సంకేతిక, రక్షణ విభాగాల్లో భారత్-అమెరికా మధ్య సహకార ధోరణి మరింత పెరుగుతుందని.. మోడీ – ట్రంప్ మధ్య ఉన్న సుహృద్భావ బంధం ఇందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా.