Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్ పై ట్రంప్ ఎఫెక్ట్... ఏమి జరిగిందంటే..?

ఇందులో భాగంగా ప్రధానంగా బీ.ఎస్.ఈ లో రిజిస్టర్డ్ కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజే రూ.8 లక్షల కోట్లు పెరిగి, రూ.452 లక్షల కోట్లకు పెరిగింది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 1:39 PM GMT
స్టాక్  మార్కెట్  పై ట్రంప్  ఎఫెక్ట్... ఏమి జరిగిందంటే..?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లతో పాటు దేశీయ మార్కెట్లూ రాణించాయి. ఇందులో భాగంగా... బీ.ఎస్.ఈ.లో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజే రూ.8 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం వేళ.. అంతర్జాతీయ మార్కెట్ తో పాటు భారత మార్కెట్లూ రాణించాయి. ఇందులో భాగంగా ప్రధానంగా బీ.ఎస్.ఈ లో రిజిస్టర్డ్ కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజే రూ.8 లక్షల కోట్లు పెరిగి, రూ.452 లక్షల కోట్లకు పెరిగింది. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పైచేయి సాధించడంతో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

ఈ క్రమంలో... నిఫ్టీ ఐటీ సూచీ సుమారు 4 శాతం మేర లాభపడగా.. సూచీలోని 10 స్టాక్స్ లాభాలో ముగిసాయి. అయితే.. ఆయా కంపెనీలకు అమెరికా కరెన్సీలోనే ఆదాయం వస్తుండటమే ఇందుకు కారణం అని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ వస్తే చైనాపై సుంకాల మోత మోగే అవకాశం ఉందనే కారణంతో షాంఘై, హోంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ఇటీవల వరుస నష్టాలతో భారీగా పతనమైన సూచీలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ వేళ కాస్త కోలుకున్నాయి. ఫలితంగా... బుధవారం రోజంతా సెన్సెక్స్ లాభాల్లోనే కొనసాగింది. ఇందులో భాగంగా... సెన్సెక్స్ 80 వేల మార్కును దాటడమే కాకుండా.. ఇంట్రాడేలో 8,569.73 గరిష్టాన్ని తాకి.. ఫైనల్ గా 901.50 పాయింట్ల లాభంతో.. 80,379.13 వద్ద స్థిరపడింది.

ఈ క్రమంలో ప్రధానంగా సెన్సెక్స్ 30 సూచీల్లో టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోపక్క ఇండస్ ఇండ్ బ్యాక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్ షేర్లు నష్టపోయాయి. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 84.30గా ఉంది.