Begin typing your search above and press return to search.

"ఈ ఎన్నికల్లో ఓడిపోతే"... డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

మాటల మాంత్రికుడు, అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అంద‌రికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Sep 2024 7:35 AM GMT
ఈ ఎన్నికల్లో ఓడిపోతే... డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
X

మునుపెన్నడూ లేనంతగా అన్నట్లుగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూఎస్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో... డొనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ ల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో.. అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరి మధ్యా మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని అన్నారు.

నవంబర్ 5న జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ట్రంప్ ప్రకటించారు. ఈసారి విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని వెల్లడించారు 78 ఏళ్ల ట్రంప్. ఈసారి తాము ఓడిపోతామని అస్సలు అనుకొవడం లేదని.. అసలు అలాంటి ఆలోచనే లేదని.. తప్పకుండా గెలుస్తామని ట్రంప్ ధీమాగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగనని ట్రంప్ తెలిపారు. ఇక.. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. దాని వెనుక ముగ్గురి పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా... కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్, తుల్సి గబ్బార్డ్ ల పేర్లు ప్రస్థావించారు ట్రంప్.

వీరిలో ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నాడీ జూనియర్ వర్క్ చేస్తారని.. దేశంలోని చెత్తను తొలగిండం కోసం మస్క్ పని చేస్తారని.. అడ్మినిస్ట్రేషన్ లో తుల్సీకి అనుభవం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా... తాము అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఇందనం ధరలను 50శాతానికి తగ్గించేదుకు కృషి చేస్తామని ట్రంప్ వెల్లడించారు.

ట్రంప్ కు కమలా హారీస్ కొత్త ప్రపోజల్!:

కమలా హారీస్ తో ఇటీవల జరిగిన ఓ డిబేట్ లో ట్రంప్ తడబడ్డారనే చర్చ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో... కమలాతో మరోసారి ఓపెన్ డిబేట్ చేయబోనని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో... వచ్చేనెల 23న సీ.ఎన్.ఎన్. వేదికగా జరిగే డిబేట్ కు తాను సిద్ధమని ప్రకటించిన కమలా హారీస్... డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ డిబేట్ కు అంగీకరించాలని పేర్కొన్నారు.

అమెరికా ప్రజల కోసం ఆయన పాల్గొనాలని.. ఎన్నికల ముందు ఒకసారి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడాలని ఆమె అన్నారు. కానీ, ప్రత్యర్థి మాత్రం తప్పించుకునేందుకు కారణాలు వెతికే పనిలో ఉన్నారని అన్నారు. ఇక ఇటీవల ఎన్.బీ.సీ. న్యూస్ విడుదల చేసిన పోల్ లో కమలా హారీస్ కు 48 శాతం మంది మద్దతు పలికితే.. ట్రంప్ కు 40 శాతం మంది మద్దతు పలికారు.