మొదటి రోజే సెంచరీ... డొనాల్డ్ ట్రంప్ భారీ ప్లాన్ ఇదే!
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jan 2025 10:30 PM GMTగత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కోసం అమెరికాతో పాటు.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు ఆందోళనతోనూ ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే పెను మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన కార్యవర్గం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయం సంచలనంగా మారింది.
దీంతో.. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చే ఆ ఆర్డర్లు ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో... ట్రంప్ తీసుకొచ్చే 100 ఆర్డర్లలో చాలా వరకూ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు! ఇదే సమయంలో... ప్రధానంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
వాస్తవానికి సరిహద్దులపై తీసుకునే నిర్ణయాలను ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ఇప్పటికే సెనెటర్లకు చెప్పినట్లు చెబుతున్నారు. ఇటీవల క్యాపిటల్ హిల్ లో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో వీటికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి తన పార్టీ సెనెటర్లకు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారనే ప్రచారం జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.
ఈ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ప్రధానంగా ఫెడరల్ షెడ్యూల్ ఎఫ్ లో ఉద్యోగుల నిబంధనలు మార్చడం.. టీకాలపై నిర్ణయం, స్కూలు జెండర్ పాలసీలతో పాటు ప్రధానంగా అమెరికా-మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ సహచరులు వీటిని తయారు చేసే పనిలో ఇప్పటికే నిమగ్నమైనట్లు చెబుతున్నారు.
వాస్తవానికి వైట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత కొత్త అధ్యక్షుడు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం సహజమే. అయితే... డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వీటిని జారీ చేయనుంది.