Begin typing your search above and press return to search.

యుద్ధాల్ని డీల్ చేయటంలో ట్రంప్.. కమలా ఎవరు బెటర్?

ఏడు రాష్ట్రాల్లో ఒక్కో చోట 600 మంది నమోదిత ఓటర్లను ఈ సర్వేకు శాంపిల్ కింద తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 4:33 AM GMT
యుద్ధాల్ని డీల్ చేయటంలో ట్రంప్.. కమలా ఎవరు బెటర్?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం దగ్గరకు వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. దీనికి కారణం.. ట్రంప్.. కమలా హారిస్ మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉండటమే దీనికి కారణం. ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారన్న దానిపై స్పష్టత రావటం లేదు. పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల సమరానికి సంబంధించిన తాజాగా వెల్లడైన ఒక సర్వే రిపోర్టు ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

యుద్ధాల వేళ అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో ఎవరు బాగా డీల్ చేస్తారు? అన్న అంశంపై జరిపిన ఒపీనియన్ పోల్ లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్వల్ప అధిక్యతను ప్రదర్శించినట్లుగా ఒక సర్వే పేరకొంది. ఇజ్రాయెల్ - హమస్, రష్యా - ఉక్రెయిన్ యుద్ధాలను డీల్ చేసే విషయంలో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ బెటర్ అన్న విషయం ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ వెల్లడించింది.

ఏడు రాష్ట్రాల్లో ఒక్కో చోట 600 మంది నమోదిత ఓటర్లను ఈ సర్వేకు శాంపిల్ కింద తీసుకున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 8 వరకు శాంపిల్ ను సేకరించారు. ఇందులో కమల హారిస్ అరిజోనా.. మిషిగన్.. జార్జియాలలో ముందంజలో ఉంటే.. నెవడా.. పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యతను ప్రదర్శించారు. ఇక.. నార్త్ కరొలైనా.. విస్కాన్సిన్ రాష్ట్రాల్లో మాత్రం వీరిద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. యుద్ధాల వేళ దేశాన్ని ట్రంప్ మెరుగ్గా నడిపిస్తారన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైంది.

ఆర్థిక వ్యవస్థ.. వలసదారుల సమస్యను ట్రంప్ బాగా డీల్ చేయగలిగితే.. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణ అంశాల విషయంలో హారిస్ మెరుగైన నిర్ణయాన్ని తీసుకుంటారని వెల్లడైంది. మన దేశంలో జరిగే ఎన్నికలకు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు పోలికే ఉండదు. మన దేశంలోని ఓటర్లకు.. అమెరికా ఓటర్లు భిన్నంగా ఉంటారు. అమెరికాలోని ఓటర్లు చాలామంది తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తామన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తుంటారు. దాచుకోవాలని అనుకోరు.

ఈ కారణంగా ఏయే రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంటుందో.. ఏయే రాష్ట్రాలు డెమొక్రాట్లకు అనుకూలంగా ఉంటుందన్న దానిపైనా స్పష్టత ఉంటుంది. దీంతో.. ఎవరి అధిక్యత ఏమిటన్నది అర్థమైపోతూ ఉంటుంది. కాకుంటే.. సమస్యల్లా వచ్చేది.. పార్టీకి.. పార్టీ సిద్ధాంతానికి సంబంధం లేకుండా తటస్థంగా ఉంటారు. వీరు ఏ పార్టీకి గుడ్డిగా మొగ్గు చూపరు. ఈ రాష్ట్రాలే ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తాయి. వీటినే స్వింగ్ రాష్ట్రాలుగా పిలుస్తుంటారు. ఈ రాష్ట్రాలే అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది తేల్చేదిగా చెబుతుంటారు.