Begin typing your search above and press return to search.

దశాబ్ధాల నాటి మర్డర్ సీక్రెట్స్ బయటకు.. ట్రంప్ సంచలన నిర్ణయం!

ఈ సమయంలో దశాబ్ధాల నాటి మర్డర్ కేసు రహస్యాలు బయటపెట్టేలా డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 1:30 PM GMT
దశాబ్ధాల నాటి మర్డర్  సీక్రెట్స్  బయటకు.. ట్రంప్  సంచలన నిర్ణయం!
X

ఆయన తీసుకున్నారు కాబట్టి అది సంచలనంగా మారుతుందో.. లేక, సంచలన విషయాలనే ఆయన టెకప్ చేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు పెడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సమయంలో దశాబ్ధాల నాటి మర్డర్ కేసు రహస్యాలు బయటపెట్టేలా డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

అవును... అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తాజాగా తన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ, మాజీ సెనేటర్ రాబర్ట్ ఎఫ్. కెన్నడీ, పౌరహక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి ఫైల్స్ ను బహిర్గతం చేయాలని తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఆదేశాలు జారీ చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెన్నడీ బాధ్యతలు చేపట్టగా.. 1963 నవంబర్ 22న టెక్సాస్ పర్యటనలో ఉండగా ఆయనను కాల్చి చంపారు. అయితే.. ఈ ఘటనపై పలుమార్లు స్పందించిన ట్రంప్.. ఆయన మరణించి 60 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆ హత్య రహస్యంగానే ఉందని.. తాను వైట్ హౌస్ కి వస్తే ఆ పత్రాలు అన్నీ బహిర్గతం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.

అన్నట్లుగానే తిరిగి వైట్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా... జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన పూర్తి రికార్డులను ఎలా బహిర్గతం చేస్తారనే విషయంపై 15 రోజుల్లోనూ... రాబర్ట్ ఎఫ్.కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాల విడుదలపై 45 రోజుల్లోనూ ప్రణాళిక ఇవ్వాలని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ను డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్... తాను ప్రస్థావించిన మూడూ చాలా పెద్ద విషయాలని.. అందులో ఉన్న నిజానిజాల కోసం కొన్ని దశాబ్ధాలుగా చాలా మంది ప్రజానికం ఎదురుచూస్తున్నారని.. ఈ హత్యల వెనుక ఏమి జరిగిందనే విషయాన్ని తెలుసుకునే హక్కు అటు బాధిత కుటుంబ సభ్యులకు, ఇటు ప్రజలకు ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రయోజనార్థమే తన తాజా నిర్ణయం అని వెల్లడించారు.

జాన్ ఎఫ్. కెన్నడీ హత్య జరిగిందిలా..!:

43 ఏళ్లకే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు జాన్ ఎఫ్.కెన్నడీ. ఈయన 1961లో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించగా.. 1963 నవంబర్ 22న టెక్సాస్ పర్యటనకు వేళ్లగా ఆయనపై దాడి జరిగింది. ఇందులో భాగంగా.. కాన్వాయ్ లో పర్యటిస్తుండగా.. వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు విడిచారు.

అనంతరం ఈ ఘటనకు సంబంధించి తొలుత లీ హార్వే అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అతడిని మరో వక్తి హత్య చేశాడు. లీ హార్వేను హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్ష వేయగా.. కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్ తో మరణించాడు. నాటి నుంచి జాన్ ఎఫ్.కెన్నడీ హత్యకు గల అసలు కారణం తెలియలేదు!

రాబర్ట్ ఎఫ్.కెన్నడీ హత్య!:

జాన్ ఫె.కెన్నడీ హత్య రహస్యం అలా ఉండిపోగా... అమెరికా అటార్నీ జనరల్, సెనెటర్ గా పనిచేసిన రాబర్ట్ ఎఫ్.కెన్నడీ 1968లో హత్యకు గురయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు లాస్ ఏంజెలెస్ లోని అంబాసిడర్ హోటల్ లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి బయటకు వస్తుండగా.. ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాబర్ట్ ఎఫ్.కెన్నడీ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సమయంలో రాబర్ట్ పై కాల్పుల ఘటనలో నిందితుడిని పాలస్తీనాకు చెందిన సిర్హాన్ గా గుర్తించారు. ఇక... మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ను కూడా1968లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా హత్య చేశారు.