Begin typing your search above and press return to search.

చూసొద్దామని వెళ్తుంటే కాల్చి పంపుతున్న ట్రంప్... ఏమిటీ రూల్?

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ.. ప్రధానంగా భారతీయ వలస సమాజం తీవ్ర ఆందోళనలోకి నెట్టబడిందనే సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jan 2025 10:30 AM GMT
చూసొద్దామని వెళ్తుంటే కాల్చి పంపుతున్న ట్రంప్... ఏమిటీ రూల్?
X

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ.. ప్రధానంగా భారతీయ వలస సమాజం తీవ్ర ఆందోళనలోకి నెట్టబడిందనే సంగతి తెలిసిందే. ప్రధానంగా హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి కంటి మీద కునుకు లేకుండా పోతోందని చెబుతున్నారు. ఈ సమయంలో యూఎస్ లో ఉన్న వారి పేరెంట్స్ కి సంబంధించిన షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... హెచ్-1బీతో పాటు బీ1/బీ2 వీసాలపై నెవార్క్ విమానాశ్రయంలో దిగిన భారతీయ తల్లితండ్రులకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో... ముందుగానే రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్స్ ను బుక్ చేసుకోనివారిని నిర్ధాక్షిణీయంగా వెనక్కి పంపించేస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు షాకింగ్ మారింది!

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో అక్రమ ప్రవేశాలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బీ1/బీ2 వంటి విజిటింగ్ వీసాలతో పాటు హెచ్-1బీ వీసాపై భారత్ నుంచి అమెరికా వెళ్లున్నవారిని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఐసొలేటెడ్ రూం లో ఉంచి గంటల పాటు విచారిస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో... వారికి ఎవరైతే అమెరికాలో ఉద్యోగం ఇచ్చారో ఆ ఎంప్లాయర్ కి అర్ధరాత్రి అయినా కాల్ చేయడం.. అవతలి వ్యక్తి రిసీవ్ చేసుకోని పక్షంలో సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లి చిన్న చిన్న గదుల్లో బంధిస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో బీ1/బీ2 వంటి విజిటింగ్ వీసాలపై అమెరికాకు వెళ్లినవారికీ కష్టాలు, అవమానాలు తప్పడం లేదని అంటున్నారు. వీరిలో ఎక్కువమంది అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఉంటున్న వారి తల్లితండ్రులు ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఈ విజిటింగ్ వీసాలపై అమెరికాలో దిగినవారిని విచారిస్తున్న పరిస్థితి అని చెబుతున్నరు.

వీరికి రిటన్ టిక్కెట్ లేకపోతే.. తిరిగి వెళ్లకుండా ఉండేలా ప్లాన్ చేసుకువచ్చిన వారిలా వారిని భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో అలా విజిటింగ్ వీసాపై వచ్చినవారికి రిటన్ టిక్కెట్ లేనిపక్షంలో 'రిజెక్టెడ్' అని వీసాపై స్టాంప్ వేసి తిరిగి వెనక్కి పంపిస్తున్నారట.

అలా వెనక్కి పంపబడినవారు మరో ఐదేళ్ల పాటు అమెరికా వెళ్లడానికి లేకుండా వీసాలను క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ సమయంలో అమెరికా వెళ్లాలనే ఆలోచనే వణికించేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.