Begin typing your search above and press return to search.

ఎలక్షన్ సమీపిస్తున్న వేళ.. ట్రంప్ "ఖాతా"లో మరో కలికితురాయి!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కి గుడ్ న్యూస్ వినిపించింది. ఇందులో భాగంగా... ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ చోటు దక్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 10:27 AM GMT
ఎలక్షన్  సమీపిస్తున్న వేళ.. ట్రంప్  ఖాతాలో మరో కలికితురాయి!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి కేవలం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికా అగ్రరాజ్యం కావడంతో ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ పై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలుపుపై అటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ లు ధీమాగా ఉన్నారు.

గెలుపు తమదే అంటే తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ట్రంప్ కు ఎలాన్ మస్క్ భారీ ఆర్థిక సాయం చేయగా!... హారిస్ కు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మద్దతుగా నిలిచారు.. భారీ విరాళం ప్రకటించారు! ఈ సమయంలో అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ చోటు దక్కించుకున్నారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కి గుడ్ న్యూస్ వినిపించింది. ఇందులో భాగంగా... ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ యూఎస్ మాజీ ప్రెసిడెంట్ సంపద 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... ప్రపంచంలోని 500 మంది సంపన్నుల జాబితాలో ట్రంప్ 481వ స్థానంలో ఉన్నారు. ట్రంప్ సెప్టెంబర్ చివర్లో మీడియా - టెక్నాలజీ గ్రూపులోని "ట్రూత్" సోషల్ మీడియా షేర్లు మూడు రెట్లు పెరిగాయి. దీంతో.. ఆయన సంపద $6.5 బిలియన్లకు పెరిగింది.

ఇక ఈ జాబితాలో $240 బిలియన్లతో.. ట్రంప్ మద్దతుదారుడు ఎలాన్ మస్క్ ఉండగా.. కమలా హారిస్ కు సపోర్ట్ చేసే ఎన్జీవో కు భారీ విరాళం ప్రకటించి, తన మద్దతు తెలిపిన బిల్ గేట్స్ $162 బిలియన్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో టాప్ 10 సంపన్నుల్లో తొమ్మిది మంది అమెరికా నుంచే ఉండటం గమనార్హం.