Begin typing your search above and press return to search.

గూగుల్ పై ట్రంప్ సీరియస్... కారణం ఇదేనంట!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Sep 2024 4:37 AM GMT
గూగుల్  పై ట్రంప్  సీరియస్... కారణం ఇదేనంట!
X

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. వరుస హామీలు ఇస్తున్నారు. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ గూగుల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆసక్తికరమైన హామీ కూడా ఇచ్చారు.

అవును... అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. తనకు ఇదే చివరి ప్రయత్నమని.. ఈ సారి ఓడిపోతే మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. ఈ సారి గెలుపు కన్ఫాం అని అంటున్నారు. మరోపక్క పోల్స్ ఫలితాల ప్రకారం కమలా హారీస్ ముందంజలో ఉన్నారని చెబుతున్నారు.

ఈ సమయంలో గూగుల్ పై విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఆయన... తన గురించి కేవలం తప్పుడు కథనాలు మాత్రమే చూపిస్తోందని గూగుల్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో... తాను తిరిగి వైట్ హౌస్ పగ్గాలు చేపడితే టెక్ దిగ్గజంపై విచారణ జరిపిస్తానని ప్రతిజ్ఞ చెస్తున్నట్లు తెలిపారు ట్రంప్.

తన గురించి గూగుల్ తప్పుడు కథనాలు మాత్రమే చూపిస్తోందని.. గూగుల్ సెర్చ్ లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గురించి మాత్రం సానుకూల కథనాలు ప్రదర్శిస్తుందని.. ఇది చట్టవిరుద్ధమైన చర్య అని.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు న్యాయశాఖ క్రిమినల్ విచారణ జరుపుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

అలా కానిపక్షంలో... తానే వారిపై విచారణ జరపాలని ఆదేశిస్తా అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో... ట్రంప్ వ్యాఖ్యలపై గూగుల్ స్పందించింది. రెండు ప్రచార వెబ్ సైట్ లు మొదటి స్థానంలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఏ రాజకీయ అభ్యర్థికీ అనుకూలంగా ఉండేలా సెర్చ్ ఫలితాలు మార్చలేదని వెల్లడించింది.

దీంతో గూగుల్ వర్సెస్ ట్రంప్ అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. తాను అధికారంలోకి రాగానే గూగుల్ పై విచారణ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.