రెండు దేశాలు, ఒక కాలువను కొనబోతున్నారు... ట్రంప్ కుమారుడు పోస్ట్ వైరల్!
ఇలా ఈ-కమర్స్ వెబ్ సైట్ లో వీటిని ట్రంప్ తన మొబైల్ లో చూస్తున్నట్లు ఉన్న ఫోటోతో పాటు.. గ్రీన్ లాండ్, కెనడా, పనామా కెనాల్ లు కార్ట్ లో యాడ్ చేసి ఉన్న ఫోటోను పెట్టారు.
By: Tupaki Desk | 24 Dec 2024 9:30 PM GMTఇటీవల ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓ దశలో కెనడా, మెక్సికోను తమ దేశంలో రాష్ట్రాలుగా చేరుస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దేశాల కొనుగోలుపై ట్రంప్ కుమారుడు పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
అవును... వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అంటున్నారు. ఈ గ్యాప్ లో ఫ్యూచర్ లో ట్రంప్ పాలన ఎలా ఉండే అవకాశం ఉందనే విషయంపై హింట్ ఇస్తున్నట్లు పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గ్రీన్ లాండ్, పనామా కాలువను కొనేస్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రతిభించేలా... ఆ మూడింటి కోసం ట్రంప్ ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి వాటిని కార్ట్ లో పెట్టి చెక్ ఔట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫోటో పెట్టారు.
ఇలా ఈ-కమర్స్ వెబ్ సైట్ లో వీటిని ట్రంప్ తన మొబైల్ లో చూస్తున్నట్లు ఉన్న ఫోటోతో పాటు.. గ్రీన్ లాండ్, కెనడా, పనామా కెనాల్ లు కార్ట్ లో యాడ్ చేసి ఉన్న ఫోటోను పెట్టారు. అంటే... వీటిని సెలక్ట్ చేసేశారు.. ఇక కొనుగోలు చేయడమే ఆలస్యం అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ పెట్టారన్నమాట. దీనికి "మేం మళ్లీ వచ్చేశాము" అనే క్యాప్షన్ జత చేశారు.
ఇందులో.. కెనడా మ్యాప్ ముందు.. ఒకటే పీస్ ఉందని, డిసెంబర్ 29లోపు ఉచిత డెలివరీ చేయబడుతుందని, ఫ్రీ రిటన్ ఆప్షన్ కూడా ఉన్నట్లు పొందుపరచగా... గ్రీన్ ల్యాండ్ ను ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య ఉచిత డెలివరీ చేస్తామన్నట్లుగా ఉంది. పనామా కాలువకూ అదే ఇష్యూ ఉంది. దీంతో.. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
కాగా... ఇటీవల ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరిక వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్ లాండ్ ను కొనుగోలు చేస్తానన్నారు.