ట్రంప్ వైఖరినే ప్రపంచ దేశాలు అనుసరిస్తే... వరల్డ్ బ్యాంక్ కీలక వ్యాఖ్యలు!
అవును... డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకునే పలు నిర్ణయాలు, చేయబోయే పనుల వల్ల పలు ప్రపంచ దేశాలకు సమస్యలు తప్పవనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jan 2025 4:36 AM GMTమరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో... ప్రపంచ వ్యాప్తంగా జనవరి 20 నుంచి పలు సమస్యలు రాబోతున్నాయని అంటున్నారు. వాటిపై ఇప్పటికె కొన్నింటిపై హింట్, మరికొన్నింటిపై క్లారిటీ ఉన్నప్పటికీ.. అధికారికంగా జనవరి 20 తర్వాత లెక్కలు మారుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో వరల్డ్ బ్యాంక్ స్పందించింది.
అవును... డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకునే పలు నిర్ణయాలు, చేయబోయే పనుల వల్ల పలు ప్రపంచ దేశాలకు సమస్యలు తప్పవనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన సమస్య.. సుంకాలు పెంచాలనే నిర్ణయం. ఈ నిర్ణయం ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.
తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం.. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు డొనాల్డ్ ట్రంప్ మాదిరి ఆలోచించి తమ సొంత టారిఫ్ లను పెంచుతూ అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటీకే మందకొడిగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు (2.7 శాతం) మరింత పడిపోయే అవకాశం ఉందని.. అది 0.3% ఉండొచ్చని స్పష్టం చేసింది.
వాస్తవానికి తన ఎన్నికల ప్రచారమప్పటి నుంచీ ట్రంప్ చెబుతున్న మాట.. సుంకాల పెంపు! ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపూ ప్రతిపాదనలపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా... ప్రపంచ దిగుమతులపై ట్రంప్ 10 శాతం సుంకం పెంచే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో... కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం వరకూ.. ఇక ప్రధానంగా చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు మాదిరిగానే ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తింది.
ఈ సందర్భంగా స్పందించిన ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్... గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. విటిని తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంభించాలని, క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు.