Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులకు జైలు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ కు ముందే

By:  Tupaki Desk   |   9 Sep 2024 4:38 AM GMT
ప్రత్యర్థులకు జైలు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ కు ముందే.. ఈ నెల 10న (మంగళవారం) జరిగే డిబేట్ కు ఇరు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ముఖాముఖి చర్చలో తలపడున్నారు. దీనికి ఓవైపు ట్రంప్.. మరోవైపు కమలాహారిస్ కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఊహించనిరీతిలో వార్నింగ్ ఇచ్చేవారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.

తాను అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిస్తే.. ఎన్నికల సమయంలో అవినీతి.. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి.. వారిని జైలుకు పంపుతానని.. కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారికి దీర్ఘ కాలిక శిక్షలు అమలు చేస్తామని పేర్కొనటం గమనార్హం. ‘‘నేను గెలిస్తే మోసం.. అధ్యక్ష ఎన్నికల వేళ అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్లను చట్టపరంగా పూర్తిస్థాయిలో విచారణ ఎదుర్కొంటారు. ఒకవేళ.. వారు కానీ దోషులుగా తేలితే దీర్ఘకాలం జైలులో ఉండేలా శిక్షల్ని అమలు చేస్తాం. ఈ విషయంలో న్యాయ ప్రక్రియలో ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. కఠిన శిక్షల్ని అమలు చేస్తాం’’ అని ట్వీట్ తో పేర్కొన్న వైనం సంచలనంగా మారింది.

ఇక్కడితో ఆగని ట్రంప్.. తన చర్యలు అందరికి వర్తిస్తాయని పేర్కొనటం గమనార్హం. ‘‘ఈ చట్టపరమైన చర్యలు అందరికి వర్తిస్తాయి. రాజకీయ నేతలు.. న్యాయవాదులు.. దాతలు.. అక్రమ ఓటర్లు.. అవినీతి ఎన్నికల అధికారులకు వస్తిస్తుంది. ఇంతకు ముందు చూడని విధంగా అక్రమాలకు పాల్పడిన వాళ్లను వెతికి మరీ విచారించి.. శిక్షలు విధిస్తాం’’ అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ తరహా ప్రతీకార హెచ్చరికలు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అరుదుగా చెబుతున్నారు. తాజా వ్యాఖ్యలతో ట్రంప్ కానీ రెండోసారి ఎన్నికల్లో గెలిచి.. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంటే.. వైట్ హౌస్ ను రాజకీయ ప్రతీకారం తీర్చుకోవటానికి వినియోగించుకుంటారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తన తాజా ట్వీట్ తో కలకలాన్ని రేపిన ఆయన.. రోజులో జరిగే చర్చ వేళ మరెలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.