Begin typing your search above and press return to search.

హారిస్, బైడెన్ ల గౌరవార్థం “చెత్త” ట్రక్... ట్రంప్ వీడియో వైరల్!

ఈ వీడియోలో... "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అని రాసి ఉన్న “చెత్త” లారీని డొనాల్డ్ ట్రంప్ నడిపారు. లారీని నడుపుతూ విస్కాన్సిన్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 6:15 AM GMT
హారిస్, బైడెన్  ల గౌరవార్థం “చెత్త” ట్రక్... ట్రంప్  వీడియో వైరల్!
X

నెలలు, వారాలు గడిచిపోయాయి.. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరి 'రోజులు' మాత్రమే సమయం ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల కోసం డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లు అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తున్నారు! ఎన్ని పరిస్థితుల్లో గెలిచి తీరాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు అత్యంత రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలకు మూడు హామీలు, ప్రత్యర్థులపై ఆరు ఆరోపణలు అన్నట్లుగా సాగుతుందని అంటున్నారు. ఈ సమయంలో తుపాకీ చప్పుళ్లు, బ్యాలెట్ బాక్సులకు నిప్పులు, మోసపూరిత ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ వంటి హడావిడిలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను “చెత్త”తో పోలుస్తూ వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. దీంతో... ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో.. జో బైడెన్ వ్యాఖ్యలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నంగా స్పందించారు.. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ వీడియోలో... "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అని రాసి ఉన్న “చెత్త” లారీని డొనాల్డ్ ట్రంప్ నడిపారు. లారీని నడుపుతూ విస్కాన్సిన్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. కమలా హారిస్, జో బైడెన్ ల గౌరవార్ధం ఈ ట్రక్ అని అన్నారు.

కాగా... ఇటీవల ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న హాస్యనటుడు టోనీ హించ్ క్లిప్ మాట్లాడుతూ... ప్యూర్టో రికోను చెత్త ద్వీపంగా పేర్కొన్నారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. దీనిపై స్పందించిన బైడెన్... అక్కడ ఉన ఏకైన చెత్త ఆయన మద్దతుదారులే అంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలను వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఖండించారు. ఎవరికి ఓటు వేస్తారు అనే దాని ఆధారంగా ప్రజలపై విమర్శలు చేయడాన్ని తాను తీవ్రంగా విభేదిస్తానని పేర్కొన్నారు.

అయితే... జో బైడెన్ చేసిన "చెత్త" వ్యాఖ్యలు... ట్రంప్ మద్దతు దారులను ఉద్దేశించి అన్నవి కావని.. హించ్ క్లిప్ ని ఉద్దేశించినవని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఈ సమయంలో ఏకంగా చెత్త లారీ నడుపుతూ ఇది కమలా హారిస్, జో బైడెన్ ల గౌరవార్ధం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.