Begin typing your search above and press return to search.

ట్రంప్‌ తో డేటింగ్... నో చెప్పిన బ్యూటీల లిస్ట్ ఇదే!

అమెరికాకు అధ్యక్షులుగా పనిచేసిన వారిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత వివాదాస్పదమైన ప్రెసిడెంట్ గా పేరు సంపాదించుకున్నారని అంటుంటారు

By:  Tupaki Desk   |   10 Oct 2023 12:30 PM GMT
ట్రంప్‌ తో డేటింగ్... నో చెప్పిన బ్యూటీల లిస్ట్ ఇదే!
X

అమెరికాకు అధ్యక్షులుగా పనిచేసిన వారిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత వివాదాస్పదమైన ప్రెసిడెంట్ గా పేరు సంపాదించుకున్నారని అంటుంటారు. దీని నిజం చేసేలా ఆయనపై ఎన్నో అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో మరిముఖ్యంగా లైంగిక విషయాలకు సంబంధించిన యవ్వారాలు కూడా చాలానే వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తో డేటింగ్ కు నో చెప్పినవారి లిస్ట్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

అవును... అమెరికాలోని ఓ చానల్‌ లో ప్రసారమయ్యే "వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్" అనే కార్యక్రమం సందర్భంగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా... 1990ల్లో తాను అమెరికాలోనే అత్యంత ధనవంతుడిని అని, తనతో డేటింగ్గ్ కు వస్తావా అని ప్రముఖ హాలీవుడ్ తార బ్రూక్ షీల్డ్స్‌ ని ట్రంప్ అడిగారట. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు.

అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిన ఆమె... "సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అని చెప్పి వదిలించుకున్నారట. ఇదే విషయాలపై మరింత తెలిపిన ఆమె... మార్లా మాపిల్స్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ట్రంప్ తనకు ఫోన్ చేసి ప్రపోజ్ చేశారని చెప్పారు. అయితే... ట్రంప్ ప్రపోజల్ నచ్చకపోవడంవల్లే.. తనకు బాయ్ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పి తప్పించుకున్నట్లు ఆమె చెప్పడం గమనార్హం.

ఇదే సమయంలో బ్రిటిష్ నటి ఎమ్మా థాంప్సన్‌ కు కూడా ట్రంప్ తనదైన శైలిలో ప్రపోజ్ చేశాడంట. ట్రంప్ టవర్స్‌ లో ఫ్లాట్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయనీ, నువ్వొస్తే కలిసి డిన్నర్ చేద్దామనీ ట్రంప్.. ఎమ్మా థాంప్సన్ కు ఫోన్ చేశారంట. దీనికి ఏమి చెప్పాలో తెలియని ఆమె... తాను చాలా బిజీగా ఉన్నానని, మరళా ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేసిందంట.

అనంతరం మరో ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హయెక్ కూడా ట్రంప్‌ కి నో చెప్పిన వాళ్ల జాబితాలో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయాలపై స్పందించిన సల్మా... తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ట్రంప్ డేట్ కి రమ్మన్నారని తెలిపారు. దీనికి బదులుగా... తాను మరో వ్యక్తిని ఇష్టపడుతున్నానని తెలిసి కూడా ఎలా రమ్మంటున్నారని అడిగి ఫోన్ పెట్టేసినట్లు ఆమె "ది డెయిలీ షో విత్ ట్రెవర్ నోవా" అనే టీవీ కార్యక్రమంలో తెలిపారు.

ఇలా రిజెక్ట్ చేసిన వారి లిస్ట్ ఈవిధంగా ఉంటే... ఒకరు మాత్రం ట్రంప్ ఆఫర్ కు ఎస్ చెప్పారంట. అయితే అనంతరం ఆమె నిరాస చెందినట్లు ప్రకటించింది. అవును... "వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్" అనే కార్యక్రమంలో మాట్లాడిన హాలీవుడ్ నటి క్యాండిస్ బెర్జెన్... గతంలో తాను ట్రంప్‌ తో డేట్‌ కి వెళ్లినట్లు తెలిపారు. అయితే... అది అంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో మరోసారి ఆయన్ని కలవలేదని తెలిపారు.

ఇది అమెరికా మాజీ అధ్యక్షుడి యవ్వారాల హిస్టరీలో ఒక భాగం! ఇలా ట్రంప్ ఇచ్చిన డేటింగ్ ఆఫర్స్ ని ప్రముఖ హాలీవుడ్, బ్రిటన్ బ్యూటీలు రిజక్ట్ చేశారంట. వీటిపై... ట్రంప్ ఎంత రిచ్ అయితే మాత్రం మరీ డేట్ కి పిలిచే పద్దతి ఇదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముసలోడే కానీ... మనాహుబావుడు అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.