కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ ఫస్ట్ రియాక్షన్ వైరల్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 July 2024 9:36 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా... కాల్పులు జరపడంతో.. ట్రంఫ్ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకెళ్లింది. దీనిగురించి ట్రంప్ తాజాగా స్పందించారు
అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స అనంతరం ఆయన తొలిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా.. నేడు తాను అసలు ప్రజలు ముందు ఉండేవాడినే కాదని.. తాను చనిపోయానని అనుకున్నట్లు తెలిపారు. ఇదొక విచిత్ర పరిస్థితి అని వ్యాఖ్యానించినట్లు ఓ మీడియా సంస్థ తాజాగా వెల్లడించింది.
ఆ సమయంలో ట్రంప్ చెవికి బ్యాండేజ్ ఉన్నట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది. తాజాగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో పాల్గొనేందుకు విమానంలో ప్రయాణిస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ... ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదని.. కాల్పుల శబ్ధాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైందని ఇప్పటికే తెలిపారు.
ఇదే సమయంలో... తన కుడిచెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని ట్రంప్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం యూఎస్ లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు భారీ సానుకూలత ఏర్పడిందని.. ఆయన గెలుపు అవకాశాలు 70శాతానికి ఎగబాకాయని పలు సంస్థలు వెల్లడించాయి.
ఈ ఘటన అనంతరం వార్ వన్ సైడ్ అయ్యిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా తుపాకీ తూటా తాకిన వెంటనే కిందకు వంగి.. తర్వాత పిడికిలి బిగించి బలంగా లేచిన ట్రంప్ తీరు పలువురిని ఆకట్టుకుందని అంటున్నారు. ఈ సమయంలో.. "ఫైట్!.. ఫైట్..!" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ పెరిగిపోయారని చెబుతునారు.
దీంతో.. "అమెరికాకు ఇలాంటి యోధుడే కావాలి" అంటూ రిపబ్లికన్లు ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. మరోపక్క ఆయన వ్యతిరేకులు.. ఇదంతా కుట్ర సిద్ధాంతంగా అభివర్ణిస్తున్నారు!