సింపతీ పాలిటిక్స్: ట్రంప్‌కు రాజకీయ హైవే!!
తాజాగా అమెరికాలో జరిగిన దుండగుడి కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది
By: Tupaki Desk | 14 July 2024 10:30 AM GMTతాజాగా అమెరికాలో జరిగిన దుండగుడి కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. నవంబ రు 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గెలుపు కోసం.. తీవ్రంగా చమటోడు స్తున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డోనాల్డ్ ట్రంప్‌పైనే దుండగుడు హత్యాయత్నం చేశాడు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్న సమయంలో దూసుకువచ్చిన ఆగంతకు డు.. ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అయితే.. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఇది పక్కన పెడితే.. ఎన్నికల్లో ఈ అంశం.. ఇప్పుడు సింపతీ రాజకీయాలకు దారితీయనుందని పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో ఇది సహజం కూడా. ఏపీలో సాధారణ ఎన్నికల సమయంలో చిన్న రాయి తగిలిన ఘటనను అప్పటి సీఎం జగన్ తనకు అనుకూలంగా.. మలుచుకునే ప్రయత్నం చేశారన్న విమర్శలు వున్నాయి. అలాంటిది.. మాటల మాంత్రికుడు.. ఏం జరిగినా..తనకు అనుకూలంగా మలుచుకునే ట్రంప్ ఈ ఘటనను వదిలి పెడతారా? అంటే.. అస్సలు వదిలి పెట్టే సమస్యే లేదు.
సో.. తనపై జరిగిన ఈ దాడిని ట్రంప్ సింపతీగా మలుచుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే అధ్య క్ష రేసులో ఉన్న జో బైడెన్ విధానాలతోపాటు.. ఆయన ఆరోగ్య సమస్యలను, అలవాట్లను కూడా.. ట్రంప్ ఏకరువు పెడుతూ.. ఏవగించుకుంటూ.. బైడెన్‌కు వ్యతిరేకంగా ప్రచారం దంచి కొడుతున్నారు. బైడెన్ మతిమరుపు రోగి అంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న డెమొక్రాట్లను కప్పలతో పోలుస్తున్నారు. నిలకడ లేని నాయకులు అంటూ.. తిట్టిపోస్తున్నారు.
ఇలాంటి ట్రంప్ తనపై జరిగిన దాడిని సింపతీగా మార్చుకునేందుకు ప్రయత్నించకుండా అయితే ఉండరు. అంతేకాదు.. గతంలోనే తాను తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా తెరమీదికి తెస్తారు. అప్పట్లో డెమొక్రాట్లు తనకు అడ్డుపడ్డారని ఆయన ఏకేయడమూ ఖాయంగానే కనిపిస్తోంది. ఇది తుపాకీ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న మెజారిటీ అమెరికన్లను మచ్చిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పైగా తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. రెండు మాసాల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ఇప్పుడు మరోసారి.. ఆయన ఇదే సెంట్రిక్‌గా సింపతీని గెయిన్ చేసుకుని అధ్యక్ష రేసులో దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.