Begin typing your search above and press return to search.

పోలాండ్ వాసుల మనసు దోచేస్తున్న దోశె

భారత్ కు వచ్చిన సందర్భంగా మన ఫుడ్ ను రుచి చూసిన పోలండ్ వాసులు.. తమ దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 7:30 AM GMT
పోలాండ్ వాసుల మనసు దోచేస్తున్న దోశె
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజా విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లటం.. అక్కడి నుంచి ట్రైన్లో ఉక్రెయిన్ వెళ్లటం తెలిసిందే. దాదాపు పది గంటల పాటు సాగే ఈ సుదీర్ఘ రైలు ప్రయాణం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పోలండ్ కు సంబంధించిన కొత్త విషయాలు మోడీ టూర్ పుణ్యమా అని వెలుగు చూస్తున్నాయి. యూరోప్ దేశాల్లో ఒకటైన పోలండ్.. ఉక్రెయిన్ కు దగ్గరగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక.. పోలండ్ విషయానికి వస్తే.. కొన్నేళ్లుగా భారతీయ ఆహారాన్ని అక్కడి ప్రజలు అమితంగా ఇష్టపడుతున్న కొత్త విషయం తాజాగా వెలుగు చూసింది.

మోడీ టూర్ కారణంగా పోలండ్ మీద ఫోకస్ పెరిగింది. ఈ సందర్భంగా కొత్త విషయాలు.. విశేషాలు వెలుగు చూస్తున్నాయి. భారతీయ వంటకాలకు ఆ దేశంలో గిరాకీ పెరుగుతోంది. దోశె.. బటర్ చికెన్ తో పాటు మన స్ట్రీట్ ఫుడ్ కు పోలండ్ వాసులు ఫిదా అవుతున్నారు. భారత్ కు వచ్చిన సందర్భంగా మన ఫుడ్ ను రుచి చూసిన పోలండ్ వాసులు.. తమ దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నారు.

ఈ కారణంగా ఆ దేశంలో ఇప్పుడు 45కు పైగా భారతీయ రెస్టారెంట్లు సేవలు అందిస్తున్న కొత్త విషయం వెలుగు చూసింది. పోలండ్ రాజధాని వార్సాలోనే డజన్ కు పైగా భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయని చెబుతున్నారు. రాజధాని వార్సాలో చేతన్ నందానీ అనే గుజరాతీ వ్యాపారవేత్త ఇటీవల చాయ్ వాలా రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు చెందిన కర్రీ హౌస్ అనే రెస్టారెంట్ చైన్ ను నడిపిస్తున్న ఆయన.. పోలండ్ వాసులు మన స్ట్రీట్ ఫుడ్ కు పిదా అవుతారని చెబుతున్నారు.

పోలండ్ వాసులు మన దేశానికి వచ్చిన సందర్భంలో మన ఫుడ్ ను టేస్టే చేస్తారని.. తిరిగి తమ సొంత దేశానికి వచ్చిన తర్వాత కూడా మన ఫుడ్ కావాలని కోరుకుంటున్నారని.. ఈ కారణంగానే ఇన్నేసి రెస్టారెంట్లుగా పోలండ్ లో ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. భారతీయ ఆహారాన్ని మాత్రమే కాదు మన కల్చర్ ను కూడా పోలండ్ వాసులు ఇష్టపడతారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

పోలండ్ వాసులు దోశె.. బటర్ చికెన్ .. మామిడి లస్సీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. భారతీయ సంస్క్రతి మాత్రమే కాదు మన సినిమాల మీదా వారిలో ఆసక్తి వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. రాజధాని వార్సాతో పాటు క్రాకో.. రోక్లా లాంటి పోలండ్ పట్టణాల్లోనూ ఇండియన్ ఫుడ్ లభిస్తుండటం చూస్తే.. మన ఫుడ్ కు ఆ దేశంలో ఉన్న ఆదరణ ఎంతన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.